సినిమాలో బాలయ్య లెజెండ్. కానీ నిజ జీవితంలో మాత్రం బావ చాటు బావమరిది. బావ కళ్ళలో ఆనందం చూడడానికి ఇపుడు బాలయ్య  'ఎన్టీఆర్'. బయోపిక్ తీస్తున్నారు. ఈ మొవీ ఇపుడు చిక్కుల్లో పడిందని టాక్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన స‌మాచారం బయటకు వస్తోంది. అదేంటంటే.


కధ ప్రకారం ఈ సినిమాలో అన్న గారు కాంగ్రెస్ కి బద్ద విరోధి. ఆయన చైతన్య రధం ఎక్కి ఇచ్చిన ప్రసంగాలే దుష్ట కాంగ్రెస్, కుక్క మూతి పిందెలు అంటూ ఓ రేంజిలో సాగుతుంది. అటువంటి చోట ఇపుడు  కీలక మార్పులు చేయాలేమోనని  'ఎన్టీఆర్'. ఫిల్మ్ మేకర్లు తర్జన భర్జన పడుతున్నారట.


నిజానికి ఈ మూవీని నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ వరకు ఉంచి ముగించాలన్నది కధగా ఉంది. ఇక చంద్రబాబు వెన్నుపోటు ఘాటు ఊండదన్నది అందరికీ తెలిసిందే. అక్కడికే మసాలా తగ్గిపోయిందని బాధపడుతూంటే ఇపుడు నాదేండ్ల ఎపిసోడ్ కి కూడ కత్తెర పడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయట. 


లేటెస్ట్ గా జరిగిన పరిణామాల బట్టి చూసుకుంటే చంద్రబాబు డిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం, కాంగ్రెస్ తో కలసి పనిచేస్తానని చెప్పడం తెలిసిందే. ఈ టైంలో కాంగ్రెస్ ని నిందిస్తూ  'ఎన్టీఆర్'.  సినిమాలో హాట్ హాట్ డైలాగులు వండి వార్చితే రేపటి పొత్తులకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆలొచిస్తున్నారట. 


మొత్తానికి కాంగ్రెస్ ని కూడా పెద్దగా విలన్ గా చూపించకుండా సినిమా ముగించాలనుకుంటున్నారట. అదే జరిగితే  'ఎన్టీఆర్'. సినిమాలో అసలు కధ మిస్ అయినట్లే. ఇంక ఈ సినిమాను ఎవరు చూస్తారని కూడా కొత్త డౌట్లు వస్తున్నాయట. మొత్తానికి బాబు డిల్లీ టూర్ కాదు కానీ  'ఎన్టీఆర్'. కధనే ఏకంగా మార్చేశాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: