హేట్ స్టోరి 4 సినిమాతో వెండితెర కథానాయికగా ఆరంగేట్రం చేసింది ఊర్వశి రౌతేలా. ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ తొలుత టీవీ రంగంలో నటిగా పేరు తెచ్చుకుంది. ఉత్తరాఖండ్ అందాల రాణిగా కిరీటం గెలుచుకుని - అటుపై టాప్ మోడల్ గానూ మెరుపులు కురిపించింది. బుల్లి తెర నుంచి పెద్ద తెరకు రావాలనుకుంటున్న ఈ ఉత్తరాది భామకు మన తెలుగులఒనే ఓ పెద్ద అవకాశం దక్కిందట.


తెలుగులో నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో ఐటెం బాంబుగా ఊర్వశి రౌతేలా కనిపించబోతోంది. ఈ సినిమాలో కిర్రెక్కించే ఫోజులతో కుర్ర జనాన్ని కుదిపేయాలని ఊర్వశి రౌతేలా డిసైడ్ అయిందట. ఇప్పటికే ఓ బాలీవుడ్ మూవీలో ఊర్వశి రౌతేలా యాక్ట్ చేసింది.

ఆ సినిమా విడుదల కాలేదు కానీ ఆమెలోని వేడి రేంజి ఏంటో తెలుసుకున్న టాలీవుడ్ రారమ్మంటోంది. మరి ఊర్వశి రౌతేలా ఒక్క సాంగ్ తోనే ఆగిపోతుందా, ఆ తరువాత కూడా తెలుగులో నయా ట్రెండ్ క్రియేట్ చేసి తన బ్రాండ్ చూపిస్తుందా  అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: