అల్లు అర్జున్ కొత్త సినిమా విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రం, బన్నీ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ తో ఉంటుందని టాక్ నడుస్తోంది. చాలాకాలంగా ఎంటర్టైన్మెంట్ కి దూరమైన త్రివిక్రం ఈ మూవీతో మరో మారు ఆ ట్రాక్ లోకి రావాలనుకుంటున్నట్లు భోగట్టా.


ఇక ఈ మూవీ తొందరలోనే సెట్స్ పైకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం  కాస్టింగ్ క్రూ అంటా సెలెక్షన్ అవుతోంది. ఫ్రెష్ గా  ఉంటుందని బన్నీ పక్కన కొత్త భామను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. భరత్ అని నేను మూవీతో వస్తూనే డీసెంట్ హిట్ కొట్టిన చిన్నది కైరా అద్వానీని బన్నికి పెయిర్ గా పెట్టాలని త్రివిక్రం దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.


ప్రస్తుతం కైరా అద్వానీ రాం చరణ్, బోయపాటి మూవీలో చేస్తోంది. చరణ్ కి జోడీగా ఆడిపాడుతున్న ఈ అమ్మడు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన మెరవబోతుందన్న మాట. చెర్రీ, బోయపాటి మూవీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉండడంతో కైరా బన్నీ కోంబో  సూప‌ర్ హిట్ అవుతుందని అంటున్నారు.


అదే జరిగితే ఈ మూవీతో కైరా హాట్రిక్ కొట్టడం ఖాయం. త్రివిక్రం మూవీలో హీరోయిన్ కి కూడా కధాపరంగా చాలా ఇంపార్టంట్ ఉంటుంది కాబట్టి కైరా దశ తిరిగినట్లెనని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: