అరవింద సినిమా దసరా భరిలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని స్వంతం చేసుకున్నది. అయితే అరవింద సమేత సినిమా కు ఏ సినిమా పోటీ లేకపోవడం తో కలెక్షన్స్ దుమ్మురేపింది. అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ ముందుకు పోతుంది. అయితే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా కు ఇంకా బ్రేక్ ఈవెన్ రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళనలో ఉన్నారు. కానీ చిత్ర యూనిట్ 100 కోట్లు షేర్ అని పోస్టర్ వదలడం తో అందరూ అయోమయం లో పడిపోయారు. నిజంగా 100 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ రావాలి కదా... 

మూడో వారాంతంలో వసూళ్లు

అమెరికాలో అరవింద సమేత మూడో వారాంతానికి 28,653 డాలర్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా 18 రోజలు కలెక్షన్లను పరిశీలిస్తే 2,170,353 డాలర్లు రాబట్టింది. మూడోవారంలో శుక్రవారం 7,911 డాలర్లు, శనివారం 14,165 డాలర్లు, ఆదివారం 6,577 డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో గతవారం తెలుగు సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే .. హలో గురూ ప్రేమ కోసమే రూ.43 లక్షలు, అరవింద సమేత రూ.33 లక్షలు, వీర భోగ వసంత రాయలు రూ.27 లక్షలు వసూలు చేశాయి.

రెండోస్థానంలో అరవింద సమేత

గతవారం ముగింపులో సుమారు రూ.1 కోటి వసూళ్లు రాబట్టడం గమనార్హం. అరవింద సమేత అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను రూ.14.40 కోట్లకు అమ్మడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తే దాదాపు 100 శాతం పెట్టుబడిని రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రికార్డుస్థాయి కలెక్షన్లు రాబట్టినా లాభాల్లోకి రాకపోవడం డిస్టిబ్యూటర్లకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: