ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. సుమారు  అరడజను బయోపిక్ ల నిర్మాణం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతోంది అంటే ఇండస్ట్రీ బయోపిక్ ల సెంటిమెంట్ పై ఎంత ఆధారపడిందో అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ వైయస్సార్ కత్తి కాంతారావు  సైనా నెహ్వాల్  టైగర్ నాగేశ్వరరావు ఇలా సెలెబ్రెటీల బయోపిక్ లు నిర్మాణం శరవేగంగా జరుపుకుంటున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో దాసరి నారాయణరావు మరణం తరువాత దాసరి బయోపిక్ వార్తలు కూడ విపరీతంగా వచ్చాయి. నిర్మాత సి. కళ్యాణ్ దాసరి బయోపిక్ ను నిర్మిస్తాడని దాసరికి అత్యంత సన్నిహితుడైన ఒక ప్రముఖ దర్శకుడు ఈ బయోపిక్ నిర్మాణానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి. 

అయితే అనూహ్యంగా దాసరి చనిపోయి 18 నెలలు కావలసి వస్తున్నా దాసరి బయోపిక్ కు సంబంధించిన ప్రయత్నాలు ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి. నిర్మాత కళ్యాణ్ దాసరి బయోపిక్ మాటను మర్చిపోయి ప్రస్తుతం బాలకృష్ణతో వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో దాసరి బయోపిక్ నిర్మాణం ప్రారంభం అవ్వకపోయినా దాసరి పాత్రను వెండి తెర పై చూపించే ప్రయత్నాలకు బాలకృష్ణ సపోర్ట్ లభించింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ లో దాసరి పాత్రను దర్శకుడు వి.వి. వినాయక్ పోషించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ దాసరిల కాంబినేషన్ లో వచ్చిన ఒకనాటి సూపర్ హిట్ మూవీలు ‘బొబ్బిలి పులి’ ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలకు సంబంధించి ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్న సీన్స్ లో ఎన్టీఆర్ రూపంలోని బాలయ్యతో పాటు దాసరి రూపంలో వినాయక్ కనిపించబోతున్నాడు..   



మరింత సమాచారం తెలుసుకోండి: