దక్షినాది ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’ సినిమా ట్రైలర్ వేడుక నిన్న చెన్నైలో అత్యంత ఘనంగా జరిగింది. కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు ఎందరో పాల్గొన్న ఈ ఫంక్షన్ లో రజినీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 

దక్షినాది సినిమా రంగానికి సంబంధించి శంకర్ తో పాటు అంత ఘనమైన కీర్తి కలిగిన ఒకే వ్యక్తి రాజమౌళి అంటూ రోబో 2.0 సినిమా గురించి చెపుతూ మధ్యలో రాజమౌళి ప్రస్తావన తీసుకు వచ్చాడు రజినీకాంత్. అంతేకాదు ‘2.0’ సూపర్ హిట్ అంటూ ఈమాట నేను చెపుతున్నాను వ్రాసుకోండి అంటూ మీడియా వర్గాలకు సవాల్ విసిరాడు రజినీకాంత్.

అంతేకాదు ఈసినిమా రజనీకాంత్‌ను ప్రతిభను పరీక్షించడానికో, అక్షయ్ కుమార్ టాలెంట్ పరీక్షించడానికో తీయలేదు అని అంటూ ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గొప్పతనాన్ని అందరికీ తెలియడానికి.600 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ మూవీ తీసిన విషయాన్ని వివరించాడు రజినీకాంత్. అంతేకాదు ఇండియన్ టామ్ క్రూయిజ్ అంటూ శంకర్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు రజినీకాంత్.

శంకర్ తన కెరీర్‌లో ఎప్పడూ ఫెయిల్ కాలేదు అని అంటూ అతడి ప్రయోగాలు ఒకొక్కసారి పరాజయం చెందినా అతడి కృషికి మాత్రం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఋణపడి ఉంటుంది అంటూ శంకర్ ను ఆకాశానికి ఎత్తేశాడు రజినీకాంత్. ‘2.0’ మూవీ ఒక గొప్ప సినిమా అని అంటూ ఈమూవీలో గొప్ప సందేశం కూడా ఉందని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను ‘2.0’ తిరిగి రాయడం ఖాయం అంటూ రజినీకాంత్ ఈమూవీ ప్రమోషన్ ను నిన్న అత్యంత భారీ స్థాయిలో మొదలుపెట్టాడు..   




మరింత సమాచారం తెలుసుకోండి: