ఆమె మన తెనాలి అమ్మాయి. అందం కోసం పందెం కట్టి నెగ్గిన సొగసుల గని. 2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ గా ఎంపికైంది. 5.8 అడుగులు ఎత్తు ఉండే ఈ బ్యూటీ మోడల్ కం యాక్ట్రస్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉంటూ బాలీవుడ్లో తన లక్ ని పరీక్షించుకుంటున్న ఈ చిన్నది తెలుగులో గూడచారి మూవీలో మెరిసింది. ఆమె లేటేస్ట్ గా తన అందాల షో తో ఫిల్మ్ మేకర్ల లుక్ ని తన వైపు తిప్పుకుంది.  ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ ఆమె శోభితా ధూలిపాల 


ఇక శోభిత గత రెండేళ్ళుగా వెండితెరపై నటిస్తోంది. హిందీలో ఆమె తొలి సినిమా రామన్ రాఘవ్. అనురాగ్ కాశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంత్రుక నాయుడుగా నటించింది. ఆ తరువాత కలకండి అంతే ఎంగ్లీష్, హిందీ బైలాంగ్వేజ్ మూవీస్ చేసింది. అందులో తారగా కనిపించింది.



ఇక తెలుగులో అడవిసేష్ దర్శకత్వంలో వచ్చిన గూడచారి మూవీ ఈ ఏడాదే విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో శోభిత సమీరా రావు గా, సమీరా షేక్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందితో పాటు మథాన్ అనే మళయాళం మూవీ, తెలుగు, హిందీలో వస్తున్న మాయా చిత్రాల్లో నటిస్తూ  కెరీర్ ని బిజీ చేసుకుంటోంది.


అందం, అభియం దండీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ తెలుగు అమ్మాయి కాబట్టి ఇక్కడా వెలుగు వెలగాలనుకుంటోంది. అందుకోసం రొమాంటిక్  పోజులతో కొన్ని స్టిల్స్ రిలీజ్ చేసింది. మరి ఆమెకు టాలీవుడ్ పెద్ద పీట వేస్తుందని ఆశిద్దాం, . అలాగే మన తెలుగు అందం జాతీయంగా అంతర్జాతీయంగానూ రాణించాలని  కూడా కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: