అనేక సంవత్సరాలుగా బుల్లితెర క్వీన్ గా కొనసాగుతున్న సుమ వివాదాలకు చాల దూరంగా ఉంటుంది. అంతేకాదు తాను నిర్వహించే కార్యక్రమాలలో సైటైర్లు వేస్తుంది కాని వివాదాల జోలుకి వెళ్ళదు. 
See the source image
అలాంటి సుమకు అనుకోకుండా ప్రదీప్ తో కలిసి నిర్వహించిన బుల్లితెర షో పెళ్ళి చూపులు వల్ల బుల్లితెర ప్రేక్షకుల నుండి అసహనం కలగడమే కాకుండా ఆమె పై అదేవిధంగా ప్రదీప్ పై కేసులు పెట్టాలి అంటూ మహిళా సంఘాలు రోడ్డు మీదకు వెళ్ళడం ఇప్పుడు సంచలనంగా మారింది.  ఇప్పటికే స్టార్ మా నిర్వహిస్తున్న ‘పెళ్ళి చూపులు’ కార్యక్రమం పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఈకార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని మహిళా సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.
See the source image
తెలుస్తున్న సమాచారం మేరకు రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈషో పై బహిరంగ నిరసన దీక్షను నిర్వహించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్నూలు కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఈ షో ద్వారా ఆడవాళ్లను అంగడి సరుకును చేస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. 
See the source image
ఈ కార్యక్రమంలో ప్రముఖంగా కనిపిస్తున్న యాంకర్లు ప్రదీప్ సుమల తీరును తప్పు పడుతూ వీరి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈషో ద్వారా స్టార్ మా యాజమాన్యానికి 60 కోట్ల నష్టం వచ్చింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో లేటెస్ట్ గా సుమ ప్రదీప్ లు పై మహిళా సంఘాలు విరుచుకు పడటం మరింత ఆశ్చర్యంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: