టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మద్య తీస్తున్న సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నాయి.  ప్రస్తుతం ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.   తాజాగా  రామ్ గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్పిస్తున్న సినిమా ‘భైర‌వ‌గీత‌’ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ఆర్జీవి శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్ని కలగలిసినట్టు కనిపిస్తున్నాయి.   ఆ మద్య వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ ఎక్స్ 100’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 
Image result for bhairava geetha STILLS
ఆర్జీవి శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు సైతం గ్రామీణ నేపథ్యంలోనే ముడిపడిన లవ్ స్టోరీతో సినిమా తెరకెక్కించాడు.  అయితే ఈ సినిమాలో కాస్త ఫ్యాక్షనీజం కూడా కనిపిస్తుంది.  వాస్తవానికి వర్మ ఫ్యాక్షన్ తరహా సినిమాలు తీయడంలో దిట్ట..ఇప్పుడు ఆయన శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ఈ తరహా సినిమాతో ఆకట్టుకోబుతున్నట్లు తెలుస్తుంది.   ఈ సినిమాలో ఆలోచనను ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేస్తే సరిపోద్ది అయ్యా.. అనే డైలాగ్ సినిమా ఎలా ఉండ‌నుందో తెలుపుతుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు తెలుస్తోంది. 
Image result for bhairava geetha STILLS
ఆ మద్య ‘భైర‌వ‌గీత‌’ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు...అప్పడే  సినిమాపై అంచ‌నాలు పెంచిన యూనిట్‌, తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసి మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చేలా చేశారు.  అయితే ఈ సినిమా లో  ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.  అంతే కాదు ఈ సినిమాలో డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. 
Image result for bhairava geetha STILLS
మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం’’ అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై తిరుగుబాటును కూడా ఈ ట్రైలర్లో చూపించారు. ‘‘సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి’’ అంటూ ముగించి సినిమాలపై అంచనాలు పెంచారు. ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: