‘బాహుబలి’  ‘బజరంగీ భాయిజాన్’  సినిమాల ఘనవిజయం వెనుక విజయేంద్రప్రసాద్ అందించిన కధలు కీలపాత్రను పోషించాయి. ఒక విధంగా రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారడం వెనుక విజయేంద్రప్రసాద్ అంధించిన కధలు కూడ చాల కీలకంగా పనిచేసాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. 

ప్రస్తుతం ఈస్టార్ రైటర్ తన 70 ఏళ్ళ వయస్సులో కూడ ‘ఆర్ ఆర్ ఆర్’  మల్టీస్టారర్ కు స్క్రిప్ట్ వర్క్ రెడీ పెడుతూ మరో వైపు తాను కథ అందించిన ‘మణికర్ణిక’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడ దగ్గరుండి మరీ చూసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కేవలం ఒక రచయితకు కోట్ల రూపాయలలో పారితోషికం అందుకునే రచియితగా ఇప్పటికే విజయేంద్రప్రసాద్ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 

ఇలాంటి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కు రెండువేల నోటు దానంగా  ఇచ్చే వింత అలవాటు ఉందట. విజయేంద్రప్రసాద్ రచయితగా ఒకస్థాయి  గుర్తింపు తెచ్చుకున్నప్పటికి తన స్టొరీ టీంలో ఎవరైనా ఒక మంచి పాయింట్ చెపితే వెంటానే తన జేబులోంచి 2వేల నోటు గిఫ్ట్ గా ఇస్తాడట. తాను కథ రాస్తున్న ఒక సినిమా డైలాగ్ కు సంబంధించిన చిన్న ఐడియా ఇచ్చినా స్టోరీకి సంబంధించి చిన్న క్లూ ఇచ్చినా లీడ్ ఇచ్చినా కూడా వెంటనే తన వద్ద ఉన్న రెండువేల రూపాయల కట్ట నుండి ఒకనోటును తీసి ఇస్తాడట ఈ సంచలన రచయిత. 

ఇలా ఆయన శిష్యులు ఎంతోమంది మంచి ఐడియాలు ఇస్తూ రెండువేల రూపాయల నోట్లను  విజయేంద్రప్రసాద్ నుండి తీసుకుంటూ ఉన్నారట. విజయేంద్రప్రసాద్ శిష్యులు ఎక్కువగా ఈవిషయం గురించి తరుచు చర్చించుకుంటూ తమ గురువు గారికి మంచి సలహాలు ఇవ్వాలని ఆరాట పడతారట. మంచి ఐడియాలు ఇచ్చిన వారికి వెంటనే బహుమానం ఇవ్వడం అనేది చాలా మంచి అలవాటు అంటూ విజయేంద్ర విజయేంద్రప్రసాద్ అనుసరిస్తున్న వ్యూహం పై ప్రశంసలు లభిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: