సైఫ్ అలీఖాన్ కూతరు కేదార్‌నాథ్ సినిమా లో ముద్దులతో రెచ్చిపోయింది. అయితే ఈ సినిమా ను నిషేధించాలని అప్పుడే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపించారు. కేదార్‌నాథ్ పుణ్యక్షేత్ర పరిధిలోని పురోహితుల సంఘం చైర్మన్ వినోద్ శుక్లా మాట్లాడుతూ... 'ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, లవ్ జిహాద్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఉందని, ఈ సినిమా విడుదల కాకుండా నిషేదం విధించాలని, లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు.

కేదార్‌నాథ్

పవిత్రమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం పరిసరాల్లో వల్గర్ డాన్సులు చేసినట్లు సినిమాలో చూపించబోతున్నారు. దీన్ని మేము ఎంత మాత్రం అంగీకరించబోము. దీనిపై ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు శుక్లా తెలిపారు. 2013లో కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంతో ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో వరద విషాదంతో పాటు హీరో హీరోయిన్ ముద్దు సీన్లు కూడా చూపించారు. ఈ ట్రైలర్ విడుదల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి.

2013 వరదల నేపథ్యం

సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు, అసభ్యకర డాన్సులు, వరద విషాదంలో ముద్దు సీన్లు ఇలా చాలా ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై బ్యాన్ విధించాలని కోరుతున్నామని వినోద్ శుక్లా తెలిపారు. కేదార్‌నాథ్ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తోంది. సుశాంత్ సింగ్, సారా మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు చిత్రీకరించారు. డిసెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: