శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మొదటి సినిమా తో తన దైన ముద్ర వేసింది. తల్లి కి తగ్గ కూతురిగా అందం , అభినయం తో అందరినీ ఆకట్టుకున్నది. అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుని ‘ధడక్’ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ నవయవ్వన సుందరి హీరోయిన్‌గా కంటే శ్రీదేవి కూతురుగానే బాగా ఫేమస్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే హాట్ హాట్ ఫొటో షూట్‌లతో పాటు.. డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకి వచ్చింది.

Image result for jhanvi kapoor latest images

గ్లామర్ షో అంటే చెవికోసుకునే జాన్వీ కపూర్ ఫోటో షూట్‌లు, మూవీ ఫంక్షన్లు, ఫ్యామిలీ పార్టీలలో పొదుపుగా బట్టలేసి అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తుంటుంది. వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్‌లో బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోస్తూ వీక్షకులు మతులు పోగొట్టింది. లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకు లేకుండా చేసింది. బిగుతైన లైట్ బ్లూ కలర్ లోయర్‌కి నేవీ బ్లూ టీషర్ట్ కాంబినేషన్‌లో ఉన్న జిమ్ డ్రెస్‌లో హాట్ కలరింగ్ ఇచ్చింది ఈ సుందరి.

Image result for jhanvi kapoor latest images

ఈ ఒంపు సొంపుల్ని కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయడానికి ఫిజిక్‌పై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తన శరీరసౌష్ఠవానికి మెరుగులు దిద్దుతోంది. తాజాగా జాన్వీ కపూర్ బాంద్రా ఏరియాలో జిమ్‌ నుండి బయటకు వస్తున్న ఫొటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. జిమ్‌లో కసరత్తు చేయాలంటే సౌకర్యవంతంగా ఉండే వస్త్రాలు ధరించడం మస్ట్. శరీరానికి అంటిపెట్టుకుని ఉండే బిగుతైన స్పోర్ట్స్ వేర్‌నే ధరిస్తారు. ఈ బిగుతైన స్పోర్ట్స్ వేర్‌లో రోడ్‌పై కనిపించి కెమెరాలకు పనిచెప్పింది జాన్వీ కపూర్.  కసరత్తులు ముగించుకుని కారు ఎక్కుతూ ఆ టైట్ డ్రెస్‌లో కెమెరాకు నవ్వుతూ పోజులు ఇచ్చింది. అయితే ఈ తరహా అందాల ప్రదర్శన ఈమెకు కొత్తేం కానప్పటికీ.. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: