‘అరవింద సమేత’ రన్ ఇంచుమించు పూర్తి కావడంతో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఏరియాలలో అదేవిధంగా ఓవర్సీస్ లో ఈమూవీ బయ్యర్లు కొద్దిపాటి నష్టాలతో బయటకు వచ్చారు. వాస్తవానికి ‘అరవింద సమేత’ తరువాత ఆమూవీకి పోటీ ఇవ్వగల స్థాయిలో ఏభారీ సినిమా విడుదల అవ్వకపోయినా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కూడ ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారకపోవడం జూనియర్ ను ఆశ్చర్య పరిచిందని సమాచారం.
Jr Ntr Mass and Class Roles in Aravinda Sametha - Sakshi
‘సింహాద్రి' మూవీ వచ్చి పదిహేనేళ్లవుతోంది దాని తర్వాత మళ్లీ ఆ స్థాయి బ్లాక్‌ బస్టర్‌ ని ఎన్టీఆర్‌ ఇంతవరకు సాధించలేదు. కొన్ని హిట్‌ సినిమాలు చేస్తూ మార్కెట్‌ని కాపాడుకుంటూ వస్తున్నా జూనియర్ కలక్షన్స్ స్థాయికి తగ్గ మూవీ ఇప్పటి వరకు రాకపోవడం జూనియర్ కే అర్ధంకాని సమస్యగా మారింది అని అంటున్నారు. 
Bad News About Aravinda Sametha For Jr NTR Fans - Sakshi
జూనియర్ తన సినిమాలకు సంబంధించి ఓపెనింగ్స్‌ వరకు తన సత్తా చాటుకుంటున్నా ప్రతి సినిమాలోను వైవిధ్యం కోసం పాటు పడుతున్నా లుక్ పరంగా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ శక్తి వంచన లేకుండా చాల కష్టపడి నటిస్తున్నా జూనియర్ కు విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నా బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఇచ్చే రేంజ్‌ స్క్రిప్ట్‌ జూనియర్ కు దక్కక పోవడం దురదృష్టంగా మారింది అని విశ్లేషకుల అభిప్రాయం. 
A still from the teaser
సోలోగా పవన్‌ మహేష్‌ లకి తీసిపోని స్టామినా ఉన్నా ఎన్టీఆర్‌ని టాప్ హీరోల రేసులో ముందుకి తీసుకెళ్లే సినిమా పడడం లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి జూనియర్ సినిమాలకు సంబంధించి డిజాస్టర్లు లేవు కానీ అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ కూడ లేవు. చివరకు వచ్చే సరికి జూనియర్ సినిమాల విషయంలో బయ్యర్లకి నష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ నటిస్తూ ఉన్నా ఆమూవీ విడుదల అయ్యాక సృష్టించబడే రికార్డులు రాజమౌళి ఖాతాలోకి లేదంటే రాజమౌళి చరణ్ జూనియర్ ల మధ్య సమానంగా క్రెడిట్ దక్కుతుంది. దీనితో జూనియర్ సోలోగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి మరో మూడు సంవత్సరాల వరకు అవకాసం లేదు అని వస్తున్న కామెంట్స్ తారక్ ను తీవ్ర అంతర్మధనంలో పడేసినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: