‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆసినిమాలో నటించిన కన్నడ హీరోయిన్ నభా నటేష్ కు చాల మంచి పేరు వచ్చింది. ఈమూవీ తరువాత ఆమెకు చాల అవకాశాలు వస్తున్నాయి. దీపావళి రోజున విడుదల కాబోతున్న ‘అదుగో’ మూవీలో కూడ ఈమె నటించింది. 
nabha natesh photo shoot
అయితే ఈమెకు ప్రస్తుత తరం టాప్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నా ఈమెకు బాగా నచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు అని అంటోంది. హీరోయిన్స్ ను చాల అందంగా చూపించే రాఘవేంద్రరావు టెక్నిక్ తనకు బాగా నచ్చుతుందని ఆమధ్య ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నభా నటేష్ కామెంట్స్ చేసింది. 
Actress Nabha Natesh Latest Photoshoot Pics
ఈకామెంట్స్ రాఘవేంద్రరావు వరకు చేరడంతో ఆయన నభా నటేష్ ను తన ఇంటికి పిలిచి గౌరవించాడట. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు సినిమాలు పిచ్చ చాల ఎక్కువ అని చెపుతూ 80-90 ప్రాంతాలలో తెలుగులో వచ్చిన చాల సినిమాలు తాను చూసాను అంటూ ఆసినిమాలలో తనకు రాఘవేంద్రరావు తీసిన సినిమాలు ముఖ్యంగా హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో రాఘవేంద్రరావు అనుసరించిన పద్ధతి తనకు బాగా నచ్చింది అంటూ ఒకనాటి టాప్ దర్శకుడు పై ఈనాటి యంగ్ హీరోయిన్ ప్రశంసలు కురిపించింది. 
Heroine Nabha Natesh latest stills
అంతేకాదు తనకు ఇప్పటి వరకు ప్రేక్షకుల నుండి ప్రేమ లేఖలు లవ్ ప్రోపజల్స్ రాకపోయినా తనను రాఘవేంద్రరావు ఇంటికి పిలిచి గౌరవించడం ఆ గొప్ప దర్శకుడు తనకు వ్రాసిన ప్రేమలేఖ గా భావిస్తున్నాను అంటూ కామెంట్స్ చేసి సంచనల వార్తలకు చిరునామాగా మారింది. దీనితో సినిమాలకు బాగా దూరం అయిపోయిన రాఘవేంద్రరావు నభా నటేష్ ను పెట్టి ఏదైనా క్యూట్ లవ్ స్టోరీని నభా నటేష్ ను అత్యంత గ్లామరస్ చూపెట్టినా ఆశ్చర్యం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: