రోబో ‘2.0’ మూవీ లేటెస్ట్ ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. దర్శకుడు శంకర్ గ్రాఫిక్ మాయాజాలం ఈమూవీ ట్రైలర్ లో అణువణువునా కనిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ కలక్షన్స్ విషయంలో చరిత్ర సృష్టించడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈ నెలాఖరున విడుదల కాబోతున్న ఈమూవీ ఫలితం గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో రాజమౌళి శంకర్ అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అన్న ట్యాగ్ కు ఎవరు అర్హులు అన్న విషయమై ఈ మాటల వార్ జరుగుతోంది.

రాజమౌళి అభిమానులు ‘మగధీర’ ‘ఈగ’ ‘బాహుబలి’ సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అన్న ట్యాగ్ కు అర్హుడు అని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ శంకర్ అభిమానులు రాబోతున్న ‘2.0’ తో శంకర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగ వ్రాయడమే కాకుండా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ స్థానాన్ని శాస్వితంగా అధిరోహించబోతున్నాడు అంటూ శంకర్ అభిమానులు రాజమౌళి అభిమానులకు ధీటైన సమాధానం ఇస్తున్నారు. 

జరుగుతున్న ఈమాటల వార్ చదివే వారికి బాగున్నా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత శంకర్ తో సమానంగా రాజమౌళికి దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈనెల విడుదల కాబోతున్న ‘2.0’ సృష్టించే రికార్డులను బట్టి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు మరింత ఒత్తిడి పెరుగుతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: