అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన నాగ చైతన్య సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగిన క్రేజ్ మాత్రం సంపాదించలేదు. చైతు కెరియర్ లో సూపర్ హిట్లు  100% లవ్ ఆ తర్వాత ప్లేస్ లో ఏమాయ చేసావే సినిమా వస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం కూడా చైతుకి హిట్ ఇచ్చింది. అయితే నాగ చైతన్యను మాస్ హీరోగా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరట్లేదు.


ఇక రీసెంట్ గా నెల గ్యాప్ తోనే రెండు క్రేజీ సినిమాలతో వచ్చాడు నాగ చైతన్య. అందులో ఒకటి శైలజా రెడ్డి అల్లుడు కాగా మరోటి సవ్యసాచి. మారుతి డైరక్షన్ లో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈమధ్యనే వచ్చిన సవ్యసాచి కూడా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది.


చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సవ్యసాచి సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఓ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా డీల్ చేయడం ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే సినిమాకు టాక్ సరిగా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వచ్చిన సవ్యసాచి సినిమా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.


చూస్తుంటే చైతుకిది కూడా నిరాశ మిగిల్చేలా ఉంది. శైలజా రెడ్డి అల్లుడు మీద భారీ హోప్స్ పెట్టుకున్న చైతు అది తుస్సుమనడంతో సవ్యసాచి సినిమాపై దృష్టి పెట్టాడు. ఇది కూడా ఫలితం తేడా కొట్టడంతో ఇప్పుడు మళ్లీ కెరియర్ సందిగ్ధంలో పడ్డాడు. నాగ చైతన్యకు సూపర్ హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: