బాలీవుడ్ టాప్ స్టార్స్ రణవీర్ సింగ్-దీపిక పదుకోనిల పెళ్ళి నవంబర్ 14 - 15 తేదీల్లో జరుగబోతున్ననేపధ్యంలో ఈపెళ్ళికి జరుగుతున్న ఏర్పాట్లు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాట్లుగా మారాయి. ఇటీవలే దీపిక పదుకోన్ కుటుంబం కొంకణి సాంప్రదాయ ప్రకారం నంది పూజతో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా రణవీర్ సింగ్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం హల్ది సెర్మనీతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. 
రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం
ఈ సెర్మనీలో రణవీర్ మొహానికి పసుపు రాసుకుని చాల సాంప్రదాయ బద్ధంగా కనిపించాడు. హల్ది సెర్మనీ అంటే వరుడి దేహానికి పసుపు పూసి నిర్వహించే ఒక సాంప్రదాయనికి సంబంధించిన వేడుక. రణవీర్ సింగ్ దీపిక పదుకోన్ ల పెళ్లి ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ మ్యారేజ్ గా జరగబోతోంది. ముంబాయికి చెందినా ఒక ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీకి ఇచ్చిన ఈ కాంట్రాక్ట్ కోట్ల రూపాయలలో ఉందని సమాచారం.  
ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్
ఈ పెళ్లి వేడుకలో దీపిక పదుకోనె సుమారు 10 కోట్ల విలువ చేసే డైమండ్ నగలను ఒక ప్రముఖ జ్యూలరీ డిజైనర్ డిజైన్ చేసినట్లు సమాచారం. కేవలం మంగళసూత్రం కోసమే 20 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పెళ్ళి కూతురుగా దీపిక లుక్ ఎలా ఉండబోతోంది అన్నది ఊహించుకోవచ్చు.  
కోట్లు ఖదీదు చేసే నగలు
రెండు సాంప్రదాయాల ప్రకారం దీపిక రణవీర్ వివాహం జరుగబోతోంది. దీపిక సారస్వత్ బ్రాహ్మిణ్ కమ్యూనిటికి చెందిన అమ్మాయి. ఆమె మాతృభాష కొంకణి. దీనితో నవంబర్ 14న కొంకణి సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుందని 15న రణవీర్ సింగ్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం సింధి స్టైల్‌లో వివాహం జరుగుతుందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఇటలీలో జరిగే పెళ్లి వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు అవ్వబోతున్నా డిసెంబర్ 1న ముంబైలో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో జరిగిన బాలీవుడ్ ఇండస్ట్రీ వెడ్డింగ్స్ లో దీపిక రణవీర్ సింగ్ ల పెళ్లి అత్యంత ఖరీదైనది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: