సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ పరిస్థుతులలో ఈవారం జరగబోతున్న మహేష్ బాలయ్యల వ్యక్తిగత మీటింగ్ పై అందరి కళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మహేష్ ను కలవబోతున్నాడని టాక్.

ఇప్పటికే ఈమూవీ దర్శకుడు క్రిష్ మహేష్ తో ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ పాత్ర విషయమై మహేష్ తో చేసిన రాయబారాలు విఫలం కావడంతో ఇప్పుడు స్వయంగా బాలకృష్ణ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ కృష్ణ కు కొంతకాలం చాల సాన్నిహిత్యం మరికొంతకాలం చాల వైరం నెలకొన్న నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో కృష్ణ పాత్ర చాల కీలకం అన్న అభిప్రాయంలో బాలయ్య ఉన్నట్లు టాక్. 
Balayya Mahesh the multistar
అయితే మహేష్ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి పాత్ర పోషించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అదీ కాకుండా మహేష్ తన సినిమాలలో ఎప్పుడూ తన తండ్రి కృష్ణ సినిమా టైటిల్స్ ను కానీ అదేవిధంగా కృష్ణ సినిమాలలోని పాటలను రీమిక్స్ చేయడం విషయంలో కానీ పెద్దగా ఆసక్తి కనపరచని నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో కృష్ణ పాత్ర విషయంలో కూడ ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు. 
Balakrishna And Mahesh Babu Multistarrer Movie
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం కాంగ్రెస్ ల మధ్య కొత్తగా చిగురించిన స్నేహం రీత్యా ఎన్టీఆర్ బయోపిక్ కు చాల మార్చులు చేయాలి అని అంటున్నారు. ముఖ్యంగా ఈ బయోపిక్ కు సంబంధించిన రెండవ భాగం అంతా రాజకీయాల చుట్టూ తిరిగే నేపధ్యంలో ఒకనాటి కాంగ్రెస్ తెలుగుదేశంల శతృత్వవాన్ని ఎవరికీ బాధ కలిగించకుండా ఎలా చూపించాలి అన్న విషయమై క్రిష్ బాలయ్యల మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: