ఈనెలాఖరుకు విడుదల కాబోతున్న రజనీకాంత్ ‘2.0’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు శంకర్ రాజమౌళిని తెగ పొగడడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. నిజంగా శంకర్ కు రాజమౌళి పట్ల అంత పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. శంకర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ దర్శకుడుగా కొనసాగుతున్న రోజులలో రాజమౌళి చిన్న స్థాయి దర్శకుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. 

దీనితో ఈమధ్య పరాజయాలతో సతమతమవుతున్న శంకర్ కంటే రాజమౌళి క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకు టార్చ్ బేరర్ లా రాజమౌళి మారిపోయాడు. దీనికితోడు రాజమౌళి ‘బాహుబలి’ కి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆదరణ రావడం టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో రాజమౌళి తనను మించిపోవడం శంకర్ కు ఏమాత్రం నచ్చడం లేదు అని టాక్. సాంకేతికంగా ఇండియన్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా ఇంతకుముందు శంకర్ పేరు చెప్పుకుంటే ఇప్పుడు అందరు రాజమౌళి పేరు చెపుతున్నారు.
Akshay Kumar's 2.0 Posters Getting Scarier With Each Passing Day
దీనితో ఎట్టి పరిస్తుతులలోను రాజమౌళికి చెక్ పెట్టె దిశలో ‘2.0’ లో విజువల్ ఎఫెక్ట్స్ యాక్షన్ ఘట్టాల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని శంకర్ విపరీతంగా శ్రమించి ఈమూవీ పై సుమారు 500 గ్రాఫిక్స్ పైనే ఖర్చు పెట్టాడు అని అంటున్నాడు. టెక్నికల్‌గా రాజమౌళిని అధిగమించాలనే ప్రయత్నంలో శంకర్ దారి తప్పాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ‘రోబో’ లో మాదిరిగా ‘2.0’ లో ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ సెంటిమెంట్ ఏమీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. సినిమా అంతా యాక్షన్ ఘట్టాలు తప్ప ఇంకేమీ లేనట్లున్నాయి. 
Teaser,Audio,Trailer
‘రోబో’ సినిమా అన్ని వర్గాలకూ అంతగా నచ్చిందంటే అందులో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి. అయితే ఇలాంటివి ఏమి ‘2.0’లో ఉన్నట్లు కనిపించలేదు ట్రైలర్ చూస్తే టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ అందుకోవాలని కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో మెస్మరైజ్ చేయాలని ప్రయత్నిస్తూ తాను రాజమౌళి కన్నా గొప్పవాడినని చెప్పుకోవడానికి ‘2.0’ విషయంలో మిగతా విషయాలను శంకర్ మర్చిపోయినట్లు కనిపిస్తోందని దీని ఫలితం ‘2.0’ కు శాపంగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: