కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. సౌత్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ కలిసి చేసిన క్రేజీ మూవీ సర్కార్. ఈ కాంబోలో ఇదవరకు వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సంచలన విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ మూవీగా సర్కార్ సినిమా వస్తుంది. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సర్కార్ సినిమా ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి.


పరదేశంలో కార్పోరేట్ సిఈఓగా పనిచేసే ఓ వ్యక్తి తన ఓటు హక్కుని వినియోగించుకోడానికి ఇండియా తిరిగి రాగా ఆల్రెడీ తన పేరు మీద వేరొకరు ఓటేయడాన్ని గుర్తిస్తాడు. అప్పుడు ఆ హీరో ఏం చేశాడు అన్నది ఈ సినిమా కథ. మురుగదాస్ రాను రాను తనకు ఇదవరకు ఏదైతే ప్లస్ అనిపించుకున్నాడో ఇప్పుడు మైనస్ గా మార్చుకుంటున్నాడు.


ఎప్పుడు కథల విషయంలో కొత్తగా ఆలోచించే మురుగదాస్ ఈమధ్య రొటీన్ స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. విజయ్ సర్కార్ విషయంలో కూడా అదే రిపీట్ చేశాడు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో సర్కార్ తెరకెక్కించాడని ఫస్ట్ షో టాక్. విజయ్ ఇమేజ్ కు తగిన కథని స్క్రీన్ ప్లే నడిపించలేదని టాక్ వస్తుంది.


విజయ్ సర్కార్ సినిమాను మహేష్ స్పైడర్ తో పోల్చుతున్నారు. లాస్ట్ ఇయర్ మహేష్ స్పైడర్ సినిమా కూడా అంతే భారీ అంచనాలతో వచ్చి బొక్క బోర్లా పడ్డది. హీరో ఇమేజ్ ను వాడుకోవడంలో మురుగదాస్ స్పైడర్ విషయంలో ఫెయిల్ అవగా ఇప్పుడు వచ్చిన సర్కార్ లోనూ అదే మిస్టేక్ చేశాడని అంటున్నారు. మరి సర్కార్ ఫైనల్ రిజల్ట్ ఏంటో ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: