చిరంజీవి చిన్నకూతురు శ్రీజ మరొకసారి తల్లి కాబోతోంది. ఈవిషయాన్ని మెగా చిన్న అల్లుడు కళ్యాణ్ స్వయంగా మెగా అభిమానులకు షేర్ చేసాడు. కళ్యాణ్ హీరోగా విడుదలైన ‘విజేత’ ఫెయిల్ అయినా తండ్రిగా మారబోతు మెగా ఫ్యామిలీకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. 
Srija Husband Kalyan Family members pics
వాస్తవానికి మెగా అభిమానులు అంతా రామ్ చరణ్ ఉపాసనలకు చిరంజీవి వారసుడు ఎప్పుడు పుడుతాడు అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే దీపావళి రోజున మెగా అల్లుడు ఈ శుభవార్తను మెగా అభిమానులకు షేర్ చేయడంతో వారంతా ఆనందంతో దీపావళి పండుగ చేసుకుంటున్నారు. కళ్యాణ్ దేవ్ మొట్టమొదటి సినిమా ఫెయిల్ అవ్వడంతో చిరంజీవి సలహాతో కొంత గ్యాప్ తీసుకుని తన వ్యాపారాల పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
Sreeja’s Mehndi Ceremony pics
శ్రీజ తన మొదటి పెళ్ళి విషయంలో కొన్ని చేదు సంఘటనలు ఎదుర్కున్నా పరిస్థితులను ఎదిరించి విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత చదువులు చదువుకుని ఆతరువాత కళ్యాణ్ దేవ్ ను పెళ్ళాడిన విషయం తెలిసిందే. చరణ్ ఉపాసనల జంటలాగే కళ్యాణ్ దేవ్ శ్రీజలు కూడ కలిసి చాల సార్లు ఫిలిం ఫంక్షన్స్ లో సందడి చేస్తూ హడావిడి చేసిన విషయం తెలిసిందే. 
Chiranjeevi daughter Srija Mehndi photos
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా కేవలం సినిమాలను మాత్రమే చేసుకుంటూ తన పూర్తి కుటుంబ సభ్యుల కెరియర్ గురించి నిరంతరం ఆలోచించే చిరంజీవికి శ్రీజ మళ్ళీ తల్లి అవుతోంది అన్న వార్త బాగా సంతోషాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా మనవలతో చాల సందడిగా హడావిడి చేసే చిరంజీవికి శ్రీజ ఈసారి దీపావళికి మంచి శుభవార్తను అందించింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: