ఇప్పటి వరకు ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్.  బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  విలన్, కామెడీ, క్యారెక్టర్ ఇలా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.  ప్రస్తుతం తండ్రి,మామ, తాతల పాత్రల్లో నటించి మెప్పిస్తున్న ప్రకాశ్ రాజ్.   తాజాగా  'ఎఫ్ 2' చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు చిత్ర యూనిట్.  'ఎఫ్ 2' చిత్రంలో..ఒకప్పుడు ఎస్వీరంగారావుని గుర్తు చేసుకుంటారని అన్నారు. 
Image result for F2 MOVIE
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూర్తి వినోదభరితంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, హీరోయిన్ల తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారట. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు నటించిన  చిత్రాల్లో ఎస్వీఆర్ తండ్రి పాత్రల్లో నటించారు.  కాగా, 'ఎఫ్ 2' చిత్రంలో ఎస్వీ రంగారావు తండ్రి పాత్రలచే ప్రభావితమైన వ్యక్తిగా, తన ఇద్దరు కూతుళ్లను ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు ఇవ్వాలనే ఆలోచన కలిగిన తండ్రిగా ప్రకాశ్ రాజ్ కనిపించబోతున్నారట.
Image result for F2 MOVIE
అంతే కాదు అచ్చం ఎస్వీఆర్ బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. లుక్ ఎస్వీఆర్ మాదిరిగానే వుంటాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన ప్రకాశ్ రాజ్ ‘ఎఫ్ 2’లో నటించిన పాత్రకు మరింత వన్నె తెచ్చే విధంగా ఉండబోతుందట.  ప్రకాశ్ రాజ్ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల జాబితాలో ఈ పాత్ర కూడా చేరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: