శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరో రవితేజ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’.ఈ చిత్రం ఇటివలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా జంటగా నటిస్తుంది. గతంలో శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన దుబాయ్ శీను సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేష్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ తెరకెక్కుతుంది.   తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.  

Image result for 'అమర్ అక్బర్ ఆంటోని' లిరికల్ వీడియో

ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందింస్తున్నాడు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదీన జరపనున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చిత్రణ మూడు భిన్న పార్శాల్లో సాగుతుంది. బలగం కంటే సొంతబలమే తనకు శ్రీరామరక్ష అని నమ్మే వ్యక్తి కథ ఇది. త్రిపాత్రాభినయంలో రవితేజ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. శ్రీనువైట్ల శైలి వినోదం, యాక్షన్ ఘట్టాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది అన్నారు. 


దీపావళి కానుకగా అందించిన ఈ లిరికల్ వీడియో సాంగ్ అదరగొట్టేస్తోంది. "హే హలో హలో డాన్ బాస్కో .. ఛల్ ఛలో ఛలో పంజూస్కో .. పడిపడి ఎంతైనా ట్రై చేస్కో .. నే దొరకను కాస్కో" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది.  తమన్ అందించిన ఈ బాణీ యూత్ ని హుషారెత్తించేలా వుంది. 'విశ్వ' రాసిన ఈ పాటను .. శ్రీకృష్ణ .. జస్ప్రీత్ .. రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. 


ఈ చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యుసింగ్, విక్రమ్‌జిత్, రాజ్‌వీర్‌సింగ్, శుభలేఖ సుధాకర్, షాయాజీషిండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్, సంగీతం: తమన్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, కథ: శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనువైట్ల.

మరింత సమాచారం తెలుసుకోండి: