విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మ్రోగబోతున్న విషయం తెలిసిందే. వెంకటేష్  కూతురు ఆశ్రిత వివాహం నవంబర్ 24న జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే   దగ్గుబాటి కుటుంబంలో ఈపెళ్లి వేడుకకు సంబంధించిన సందడి మొదలైంది అని వార్తలు వస్తున్నాయి.  

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడితో ఆశ్రిత వివాహం జరుగబోతోంది అని టాక్. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలుపడంతో వీరి వివాహానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఆశ్రిత పెళ్లి    హైదరాబాద్‌ లోనే వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  

తెలుస్తున్న సమాచారం మేరకు రామానాయుడు స్టూడియోలో వెయబోయే ఒక భారీ సెట్ లో వీరి పెళ్లి జరగా బోతున్నట్లు సమా చారం. అయితే వెంకటేష్ కు కాబోయే అల్లుడి పేరు కాని ఇతర వివరాలు కాని బయటకు పొక్కకుండా ఇప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.  

బిస్కట్స్ ఐటమ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కోర్స్ చేసిన ఆశ్రిత ఈరంగం పై ఇంట్రెస్టుతో ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఉండే బిస్కెట్స్ కుకీస్ తయారుచేసే వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆశ్రిత సినిమా ఫ్యామిలీలో పుట్టినా  ఆమెకు ఫుడ్ అండ్ ట్రావెల్ బిజినెస్ లలో బాగా ఆసక్తి ఉండటంతో వెంకటేష్ ఆశ్రితను ఫుడ్ బిజినెస్ లో ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వెంకటేష్ నిజంగానే వెంకీ మామగాఅవ్వబోతున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: