ఆమెలో ఎవరికీ లేని రెండు లక్షణాలు ఉన్నాయి. అందంగా ఉండడం అందులో ఒకటి అయితే, అసమాన అభినయం మరొకటి. ఇలా రెండు కలసిన తారలు అతి తక్కువగా కనిపిస్తారు. సౌందర్యంతో మెరుపులు మెరిపిస్తూ నటనతో ఆమె  మురిపిస్తుంది. అందుకే ఆమె అందరి అభిమాన తార అయింది. అనుష్క శెట్టి తెలుగులోకి వస్తూనే సూపర్ అనిపించేసుకుంది. ఆ తరువాత గ్లామర్ తో గ్రామర్ కలిపి టాప్ స్టార్ గా ఎదిగిపోయింది.


కర్నాటకకు  చెందిన  అనుష్క 1981 నవంబర్ 7న బెంగళూర్లో   పుట్టారు. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పొందిన ఆమె యోగా టేచర్ గా ఉంటూ సినిమా రంగంలోకి ప్రవేశించారు. 2005లో తెలుగుల సూపెర్ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఆమె తొలి కధానాయకుడు అక్కినేని నాగార్జున. ఆ సినిమా ద్వారా తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న అనుష్క తెలుగులో వెనుతిరిగి చూడలేదు.


 అస్త్రం, బలాదూర్, చింతకాయల రవి, ఒక్క మగాడు, విక్రమార్కుడు  ఇలా సినిమాలు చేస్తున్న అనుష్క కెరీర్లో మలుపు తిప్పిన సినిమా అరుంధతి. శత  చిత్ర దర్శకుడు కోడి రామక్రిష్ణ తీసిన ఈ సినిమా అనుష్కను బొమ్మాళీగా మార్చేసింది. ఆ తరువాత ఆమె బిల్లా. స్వాగతం, లక్ష్యం, శౌర్యం వంటి సినిమాల్లో గ్లామర్ రోల్స్ ప్లే చేస్తున్న దశలో బాహుబలి సినిమా లో చాన్స్ వచ్చింది. అంతే అనుష్క దశ తిరిగింది. బాహుబలి 2 మూవీలో కూడా ఆమె అద్భుతమైన నటన కనబరచింది.


అలాగే రాణీ రుద్రమదేవిలో హిస్టారికల్ రోల్ చేయడం అనుష్కకే సాధ్యం అన్నంతగా నటించింది. ఇక పంచాక్షరి, భాగమతి వంటి చిత్రాలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. అనుష్క ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో గుర్తుండిపోయే పాత్రలే ధరించింది. భాగమతి తరువాత కొత్త సినిమాలు ఏవీ సైన్  చేయని అనుష్క తొందరలోనే ఓ మూవీలో నటిస్తుందంటూ  ఫిల్మ్ నగర్ టాక్. అనుష్క మరిన్ని పుట్టిన రోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ..


మరింత సమాచారం తెలుసుకోండి: