తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు  ‘ఎన్టీఆర్’ఎన్టీఆర్ బయోపిక్.  ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.  ఎన్టీఆర్ నటనా జీవితం, రాజకీయ జీవితంపై రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించిన నటీ,నటుల ఫస్ట్ లుక్ ఇప్పటికే కొన్ని రిలీజ్ చేశారు. 
Image result for ntr biopic posters
సీఎం చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, నందమూరి హరికృష్ణగా కళ్యాన్, ఎన్టీఆర్ సతీమనణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, అతిలోక సుందరి శ్రీదేవి గా రకూల్ ప్రీత్ సింగ్, రిసెంట్ గా సావిత్రి పాత్రలో నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 
Related image
తాజాగా ఈ చిత్రంలో అందాల భామ  అనుష్క కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  జనవరి 9న తొలిభాగం 'ఎన్టీఆర్ - కథానాయకుడు' విడుదల కానుండగా, బీ సరోజాదేవి పాత్రలో అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.  ఆ తరం చిత్రాల్లో ఎన్టీఆర్-బి సరోజాదేవి కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 
Image result for ntr biopic posters
ఆ చిత్రాల సన్నివేశాలు కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో చూపించబోతున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగానే, అనుష్క ఫస్ట్ లుక్ స్టిల్ విడుదల అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సరోజాదేవి పాత్రలో అనుష్క నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: