బీ సరోజాదేవి అలనాటి అద్భుత నటి. ఆమె తెలుగులో పాండురంగ మహత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అన్న నందమూరి తో ఎన్నో క్లాసికల్ మూవీస్ చేశారు. స్వర్ణయుగంలో చెప్పుకోదగిన అనేక చిత్రాల్లో కధానాయిక బీ సరోజాదేవి. అందంతో పాటు చక్కని  అభినయం కలిగిన ఆమె అరవై దశకంలో టాప్ హీరోయింగా ఓ వెలుగు వెలిగారు. ఆ ప్రతిభామూర్తిని మరో మారు ఈనాటి ప్రేక్షకులకు పరిచయం చేయాలుకోవడం ఓ సాహసం అయితే ఆమెలా నటించడమూ అంతే సాహాసం, మరి అలాంటి ప్రయోగమొకటి తెలుగు తెరపై  జరగబోతోందట.


అలనాటి అందాన్ని ఈ జనరేషన్ కి అనుష్క రూపంలో అందించేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారుట. ‘ఎన్టీఆర్ బయోపిక్ లో బీ సరోజాదేవి పాత్రను అనుష్క పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు క్రిష్ అనుష్కతో సంప్రదించి ఒకే చేసారని చెబుతున్నారు. ‘ఎన్టీఆర్ తో బీ సరోజాదేవి ఎన్నో మరపురాని చిత్రాల్లో జోడీగా కనిపించి శభాష్ అనిపించుకున్నారు. ఆమె పాత్రలో అనుష్క అయితే కరెక్ట్ గా ఉంటుందని  ‘ఎన్టీఆర్ చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారట. చిత్రమేమిటంటే బెంగళూరు కి చెందిన బీ సరోజాదేవి పాత్రను అదే బెంగళూరు కి చెందిన అనుష్క పోషించడం.


 త్వరలోనే అనుష్క రెండు లేదా మూడు రోజుల పాటు ‘ఎన్టీఆర్’ కోసం డేట్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు తమిళంలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అనుష్క చేయబోతున్న విషయం తెల్సిందే. అనుష్క రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.


ఆమె చివరి చిత్రం భాగమతి. అది రిలీజ్ కావడం విజయవంతం కావడం కూడా జరిగిపొయింది కానీ అనుష్క తరువాత చిత్రం మాత్రం ఇంతవరకూ ఏదీ  లేదు. ఇపుడు ఆమె మరో మారు తెలుగు తెరపై ఇలా కనిపించడం ద్వారా అభిమానులను మురిపించడం ఖాయమంటున్నారు. పుట్టిన రోజు వేళ ఈ న్యూస్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: