మురుగదాస్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన 'సర్కార్' చిత్రం, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేశ్  నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించింది. ఈ చిత్రం చూసిన వాళ్లు .. నటన పరంగా విజయ్ బాగా చేశాడని అంటున్నారు. సీఈవోగా విజయ్ చాలా స్టైలీష్ గా కనిపించాడని చెబుతున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చే సీన్స్ లో ఆయన నటన చూసితీరవలసిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Image result for సర్కార్ కలెక్షన్లు

గతంలో మెర్సిల్ తెలుగు లో అదిరింది చిత్రం పై ఎలాంటి టాక్ వచ్చిందో అంతకు మించిన ప్రశంసలు ఈ చిత్రంతో పొందాడు హీరో విజయ్.  యాక్షన్ సీన్స్ లోను .. ఎమోషన్స్ సీన్స్ లోను విజయ్ శభాష్ అనిపించాడని అంటున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చే సీన్స్ లో ఆయన నటన చూసితీరవలసిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన చిత్రమవుతుందనీ, మురుగదాస్ కాంబినేషన్లో ఆయనకి హ్యాట్రిక్ హిట్ పడినట్టేననేది అభిమానుల మాట.

Vijay Sarkar In Disputes And Demonding Scenes Should Remove - Sakshi

ఇక వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీస్తుందేమో చూడాలి. తాజాగా ఈ చిత్రం సర్కార్ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. వాస్తవానికి తెలుగు లో గురు, శుక్రవారాల్లో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి..కానీ ‘సర్కార్’ మాత్రం మంగళవారం రిలీజ్ కావడంతో కలెక్షన్ల పరంగా వసూళ్లు చేస్తుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి.  అంతే కాదు ఈ చిత్రం మొదట యావరేజ్ టాక్ తెచ్చుకున్నా..తర్వాత పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  మంగళవారం విడుదలైన ఈ సినిమా ఒక్క రోజులోనే భారీ వసూళ్లతో రికార్డు సృష్టిస్తోంది.

Image result for సర్కార్ కలెక్షన్లు

చెన్నైలో 70 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఒక్క రోజులోనే రూ. 2.41 కోట్లు వసూలు చేసింది. ఇక, ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్లు దుమ్మురేపాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు రూ. 2.32 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.  విజయ్ కెరియర్లో ‘సర్కార్’ చెప్పుకోదగిన చిత్రమని అభిమానులు అంటున్నారు.  మురుగదాస్ కాంబినేషన్లో ఆయనకి హ్యాట్రిక్ హిట్ పడిందని అభిమానుల మాట. ఇక వసూళ్ల విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: