టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు ఎంతో మంది వారసులుగా పరిచయం అయ్యారు..కొంత మంది సక్సెస్ సాధిస్తే..మరికొంత మంది అడ్రస్ లేకుండా పోయారు.  హీరోల కుమారులే కాకుండా స్టార్ ప్రొడ్యూసర్లు, దర్శకుల కుమారులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ తన కుమారుడు సినిమాల్లో నటించాలని కోరిక తెలుసుకొని  1989 లో ‘సింహస్వప్నం’ సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తన మొదటి సినిమాలోనే జగపతి బాబు డబుల్ రోల్ చేశాడు.  కాకపోతే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.
Image result for jagapati babu father
 ఆ తర్వాత జగపతిబాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి సినిమాలతో సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన వాయిస్ బాలేదని కొన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం ఫిదా అయ్యారు.   జగపతి బాబు దాదాపు 100 సినిమాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు.  25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కున్న జగపతిబాబు. 
Image result for legend movie jagapati babu
ఇక బోయపాటి శ్రీనివాస్ - బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’సినిమాతో విలన్ గా మారారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు జగపతి బాబు వరుసగా విలన్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా  ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతి బాబు వాసత్వమనేది రాజకీయాల్లోనే కాదు .. ఇండస్ట్రీలోను ఉందనే సంగతి తెలిసిందే. వారసులను తెచ్చేసి తమపై బలవంతంగా రుద్దేస్తున్నారనే భావన ఆడియన్స్ లో వుంది. 
Related image
నేను ప్రముఖ నిర్మాత తనయుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను..ఇంట్రడక్షన్ వరకే నాకు మా నాన్న ఉపయోగపడ్డారు. ఎంట్రీ ఈజీగా వుంటుందనే తప్ప .. టాలెంట్ వున్న వాళ్లే నిలదొక్కుకుంటారు. వారసులుగా వచ్చిన వాళ్లంతా సక్సెస్ అవ్వాలనే రూలేం లేదు. నేను ఆడియన్స్ పై బలవంతగా రుద్దబడిన హీరోను కాదు .. నా విషయంలో అది వర్తించదు అని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: