మీటూ కాదు కానీ సినిమా రంగంలో లైంగిక వేధింపులు చేసిన వారి బండారం బయటపడుతోంది. వెండి తెరపై హీరోలుగా చలామణీ అవుతూ తెర వెనక మాత్రం విలన్ వేషాలు వేసే వారిని మీటూ ద్వారా ఉతికేస్తున్నారు. ఇలా ఎందరో బయటపడిపోయారు. ఇపుడు  ఓ దక్షిణాడి టాప్ హీరో వంతు వచ్చింది. బాలీవుడ్ అందాల భామ అమైర్‌ దస్తూర్‌ తనకు జరిగిన వేధింపులను గురించి ఇలా  బయటపెట్టింది. ఓ పెద్ద స్టార్ కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో తనకు నరకం చూపించాడంటోంది అమైర్‌ దస్తూర్‌



దక్షిణాది తో పోల్చుకుంటే ఉత్తరాదే బెటర్ అని అంటున్న అమైర్‌ దస్తూర్‌ తనకు జరిగిన ఆ అనుభవాన్ని మరచిపోలేనని అంటోంది. దక్షిణాదిన ఓ సినిమా చేస్తున్న టైంలో ఆ చిత్రం హీరో తన మీద చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ విషయాన్ని ఆ చిత్ర డైరెక్టర్ తో చెప్పానని ఇక అక్కడ నుంచి నరకం మొదలైందని అమైర్‌ దస్తూర్‌ గతాన్ని వెళ్ళబోసుకుంది,


తనను షూటింగ్ కి టైం కి రమ్మని చెప్పి ఖాళీ గా కూర్చోబెట్టేవారనిమ్ అలా ఎన్నో అవమానాలు చేశారని  చెప్పుకొచ్చింది.  అలా బాధనంతా భరించానని అంటున్న అమైర్‌ దస్తూర్‌ ఆ హీరోకు ఎంతో పలుకుబడి ఉందని చెప్పింది. అయినా అతన్ని వదిలే ప్రసక్తే లేదని, ఏదో రోజు  అతని పేరు లోకానికి  చెప్పి రచ్చకు ఈడుస్తానని గట్టిగా చెబుతోంది.


ఇక సినిమా రంగానికి వచ్చి అయిదేళ్ళు అవుతోందని, తనను తాను రుజువు చేసుకున పాత్ర ఏదీ ఇంతవరకూ రాలేదని చెప్తున్న అమైర్‌ దస్తూర్‌ తాను గ్లామర్ డాల్ ని మాత్రమే కాదని, సత్తా చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. తనకు బిగ్ బి అమితాబ్ తో నటించాలని ఉందన్నది కోరికగా చెప్పిన ఈ అందాల భామ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఫ్యాషన్ డిజైనర్ ని అయ్యేదాన్ని అంటోంది. ఇక సినిమాలకు గుడ్ బై  ఛెబితే హాపీగా గోవా బీచ్ లో కాఫీ కేఫ్ పెట్టుకుంటానని అంటోంది. మొత్తానికి అమైర్‌ దస్తూర్‌ డేరింగ్ డేషింగ్ హీరోయిన్ గానే చెప్పాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: