కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ బెడ్ రూమ్ ఫొటోలు లీక్ కావడం సంచలనం రేపింది.  మొదట అవి మార్ఫింగ్ అని అంతా అనుకున్నారు. అయితే అవి అక్షర స్మార్ట్ ఫోన్ నుంచి బయటకు వచ్చినవే అని, ఎవరైనా ఆమె ఫోన్ ను హ్యాక్ చేసి వాటిని ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేసి ఉంటారని విశ్లేషకులు అంచనా వేశారు. లేదా అక్షర ఆ పిక్స్ ను ఎవరితోనైనా షేర్ చేసుకుని ఉన్నా.. వారి నుంచి కూడా అవి బయటకు వచ్చి ఉండవచ్చు అనే అభిప్రాయాలూ వినిపించాయి.


కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫోటోలు వాళ్ళే లీక్ చేశారా ...!

ఈ అంశంపై స్పందించింది అక్షర. తన ప్రైవేట్ పిక్స్ ఎలా లీక్ అయ్యాయో తనకు తెలియదని అక్షర పేర్కొంది. అవి మార్ఫింగ్ కాదు అని ఆమె ధ్రువీకరించింది. ఈ విషయంలో తను ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా అక్షర ప్రకటించింది. ఈ విషయాన్ని తను తేలికగా వదలను అని, దీనివెనుక ఎవరు ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలకు తను సమాయత్తం అవుతున్నట్టుగా కమల్ హాసన్ చిన్న కూతురు ప్రకటించింది.


కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫోటోలు వాళ్ళే లీక్ చేశారా ...!

ఒకవైపు మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్నా.. తనలాంటి ఒక యంగ్ గర్ల్ ఇలాంటి చేష్టకు బలికావడం దురదృష్టకరమని అక్షర పేర్కొంది. తను బాధితురాలిని అని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ దుర్మార్గం వెనుక ఎవరున్నారో తనకు అస్సలేమాత్రం తెలియడం లేదని, దీనివెనుక ఎవరున్నారో తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని తను ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం అధికారులను కోరానని అక్షర పేర్కొంది. మరి ఈ అంశంపై పోలీసుల పరిశోధన ఎలా ఉంటుందో.. ఎవరిని నిందితులుగా, దోషులుగా తేలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: