Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:13 am IST

Menu &Sections

Search

హారర్..థ్రిల్లర్ మూవీతో భయపెట్టబోతున్న అంజలి!

హారర్..థ్రిల్లర్ మూవీతో భయపెట్టబోతున్న అంజలి!
హారర్..థ్రిల్లర్ మూవీతో భయపెట్టబోతున్న అంజలి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకులు, నటుడు అయిన లారెన్స్ ‘ముని’ సినిమాతో మొదలు పెట్టిన ఈ తరహా సినిమాలకు తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉంది.  ముని తర్వాత ఇదే తరహా హర్రర్, కామెడీ జోనర్ లో కాంచన, గంగ సినిమాలతో వచ్చారు లారెన్స్. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.  ఇక తెలుగు లో ఆ మద్య అంజలి నటించిన ‘గీతాంజలి’కూడా మంచి విజయం అందుకుంది.   
actress-anjali-puri-jagannadh-lisa-telugu-movie-ra
తాజాగా మరోసారి హర్రర్ మూవీతో భయపెట్టడానికి వస్తుంది అంజలి.  ‘లిసా’ పేరిట తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న సినిమాకు రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తెలుగు.. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే..ఐటమ్ సాంగ్స్ లో నటించి మెప్పిస్తుంది అంజలి.   ఆమద్య రిలీజ్ చేసిన ‘లిసా’ ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.   డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో అంజలి కనిపించనుంది.

actress-anjali-puri-jagannadh-lisa-telugu-movie-ra
తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇంతవరకూ వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలకి .. ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలో అంజలి లుక్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు.  దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ లుక్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ఇది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
actress-anjali-puri-jagannadh-lisa-telugu-movie-ra
దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


actress-anjali-puri-jagannadh-lisa-telugu-movie-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ