దీపావళిని టార్గెట్ చేస్తూ విడుదలైన ‘సర్కార్’ మన తెలుగులోనే కాకుండా తమిళనాడులో కూడ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆటాక్ తో సంబంధం లేకుండా ఈసినిమాలో మురగదాస్ ఎన్నికల కమీషన్ కు సంబంధించిన 49పి సెక్షన్ పై లేవనెత్తిన చర్చలు ఈమూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా తమిళనాడులో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
Sarkar poster
ఈసినిమాను ప్రదర్శనను అడ్డుకోవాలని అధికార ఆల్ ఇండియా అన్నా డి మ్ కె రంగంలోకి దిగడమే కాకుండా ఏకంగా ఈమూవీ దర్శకుడు మురగదాస్ ను అరస్ట్ చేయాలని నిన్న అర్దరాత్రి మురగదాస్ ఇంటి వద్ద కొంతమంది తమిళనాడు పోలీసులు సృష్టించిన హైడ్రామా ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 
Vijay in Sarkar
ఈసినిమాలోని సీన్స్ తమ అధికార పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి అంటూ అన్నా డి మ్ కె నేరుగా రంగంలోకి దిగడమే కాకుండా మురగదాస్ ను అరెస్ట్ చేయాలని నిన్న అర్దరాత్రి భారీ సంఖ్యలో పోలీసులను మురగదాస్ ఇంటికి పంపినట్లు సమాచారం. అయితే ఆసమయానికి మురగదాస్ ఇంటిలో లేదని తెలియడంతో వారంతా తిరిగి వెళ్ళిపోయినట్లు మీడియా వార్తలు వ్రాస్తోంది.
This is happening for the first time for Vijay in Sarkar
ఈవిషయం పై మురగదాస్ స్పందిస్తూ ఒక ట్విట్ కూడ చేసాడు. తమిళనాడు పోలీసు హైద్రామాను వివరిస్తూ ఈసినిమాను అడ్డుకోవాలని అన్నా డి మ్ కె తో పాటు భారతీయ జనతా పార్టీ కూడ తీవ్రంగా ప్రయత్నిస్తోంది అంటూ మురగదాస్ ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాను ప్రదర్శిస్తున్న తమిళనాడులోని మధురై కోయంబత్తూర్ జిల్లాలలోని ధియేటర్స్ యాజమాన్యాలు ఈమూవీ ప్రదర్శనను నిలుపుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అనుకోని వివాదాలు వల్ల ‘సర్కార్’ మూవీ కలక్షన్స్ విపరీతంగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: