తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ నెల 6న రిలీజ్ అయిన ‘సర్కార్’ చిత్రం మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతుంది.  రాజకీయ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం మురుగదాస్ దర్శకత్వం వహించగా స్టార్ హీరో విజయ్ నటించాడు.  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి ముఖ్యపాత్రలో నటించింది.  అయితే ఈ చిత్రం లో కొన్ని తమిళ నాడు ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని..ముఖ్యంగా అమ్మ జయలలితను కించపరిచే విధంగా వ్యంగ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తుంది.
Image result for sarkar movie
ఓ వైపు మొదటి రోజే రూ.47 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసిన ‘సర్కార్’ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న త‌క్ష‌ణ‌మే నిలిపేయాల‌ని మధురైలోని ఓ కాంప్లెక్స్‌ ముందు అన్నాడిఎంకె కార్యకర్తలు ధర్నాకు దిగారు.
Image result for sarkar movie
అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీన్లను తొలగించేందుకు అంగీకరించారు. ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు కలిసి ‘అభ్యంతరకర సన్నివేశాలు’ తొలగించేందుకు అంగీకరించినట్టు ప్రకటించారు. పథకాలను ప్రస్తావించే సమయంలో మ్యూట్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తాం సెన్సార్ బోర్డు నుంచి అప్రూవల్ లెటర్ కూడా వచ్చింది. రేపు మధ్యాహ్నం నుంచి థియేటర్లలో రీఎడిట్ చేసిన వెర్షన్ ప్రదర్శన చేస్తామని వెస్ట్ జోన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్. సుబ్రహ్మణ్యం తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: