టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది ఇతర భాషల హీరోయిన్లు తమ సత్తాచాటుకున్నారు.  వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా ‘దేవదాసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా.  ఒక్క సినిమాతోనే తన నడుం వొంపులు చూపించి కుర్రాళ్లను పిచ్చివాళ్లను చేసింది.  దాంతో దర్శక, నిర్మాతలు ఇలియానా చుట్టు తిరిగడం మొదలు పెట్టారు.  వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకున్న ఇలియానా స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. 
Related image
తెలుగు, తమిళంలో వరసగా అగ్ర హీరోల సరసన నటిస్తున్న ఇలియానా అనుకోకుండా బాలీవుడ్ కి వెళ్లింది.  అయితే అక్కడ మాత్రం ఈ గోవా బ్యూటీకి సక్సెస్ కలిసి రాలేదు.  అలా కొంత కాలం బాలీవుడ్ లోనే గడిపింది. తెలుగు లో రావాలని ప్రయత్నాలు చేసినా సరైన అవకాశాలు రాకపోవడం..అప్పటికే కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోవడంతో ఇలియానా తెలుగు లో నటించే అవకాశం లేకుండా పోయింది.  కాకపోతే ఇక్కడ ఐటమ్ సాంగ్స్ కి ఛాన్స్ ఇస్తామంటే..ససేమిరా అనడంతో కొంత కాలం టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పినట్లే అయ్యింది. 
Related image
తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ఈ నెల 16వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.   గతంలో రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.  చాలా కాలం తర్వాత మరోసారి ఈ జంట కనువిందు చేయబోతుంది. గతంలో ఇలియానా వరుసగా సినిమాలు చేయడంతో.. డబ్బింగ్ చెప్పే సాహసం చేయలేదు. తాజాగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో ఇలియానా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
Related image
మొదటి సారిగా ఇలియానా చేసిన ప్రయోగం సక్సెస్ అవుతుందా..ఆడియన్స్ ని మెప్పించగలదా..లేదా చూడాలి. అంతేకాదు గత చిత్రాల్లో నాజూకు భామగా ఒయ్యారాలు ఒలకబోసిన  ఇలియానా, ఈ సినిమాలో బొద్దుగుమ్మగా కనిపించనుంది. శ్రీను వైట్ల ఎదురుచూస్తోన్న సక్సెస్, ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: