టాప్ హీరోల భార్యలు మాత్రమే కాకుండా టాప్ దర్శకుల భార్యలు కూడ రకరకాల బిజినెస్ లు ప్రారంభిస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డీ చైల్డ్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను ప్రారంభించి ఇప్పటికే ఆసంస్థను అత్యంత విజయవంతంగా నడిపిస్తోంది. 
Image may contain: 2 people, people smiling
రామ్ చరణ్ భార్య ఉపాసన బిజినెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి భార్య రమా రాజంమౌళి సినిమాలు అన్నింటికీ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా కొనసాగుతూ ఉంటే దర్శకుడు శ్రీనువైట్ల భార్య ‘వేదిక్’ మిల్క్ పేరుతో రకరకాల ఆర్గానిక్ మిల్క్ ప్రాడక్ట్ బిజినెస్ కొనసాగిస్తోంది. 

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ‘లాండ్రీ కార్ట్’ పేరుతో డ్రై క్లీనింగ్ బిజినెస్ లోకి రావడం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ప్రీమియం సూట్స్ ఖరీదైన చీరలు వాషింగ్ కు సంబంధించిన ఈ లాండ్రీ మార్ట్ ఒక ప్రముఖ సంస్థ ప్రాంచ్చేజ్. 
Sukumar  with his wife Hamsini.
ఈసంస్థ ప్రారంభిస్తూనే హైదరాబాద్ లో ఏకంగా మూడు చోట్ల బ్రాంచ్ లు పెడుతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అత్యంత సమర్ధతతో కూడిన వర్కర్స్ తో సుకుమార్ భార్య ఈ కొత్త బిజినెస్ ను నిర్వహించబోతున్నట్లు సమాచారం సుకుమార్ కు ఫిలిం ఇండస్ట్రీతో ఉన్న పరిచయాలు దృష్ట్యా సుకుమార్ భార్య నిర్వహించబోతున్న ఈ సంస్థ త్వరలోనే ప్రముఖ వ్యాపార సంస్థగా మారినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: