మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్నసినిమా “వినయ విధేయ రామ”, అయితే ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.  దీపావళి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చెర్రీ లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. ఒక చేత్తో గొడ్డలి పట్టుకొని...మరోచేత్తో గన్ను అందుకోబోతున్నట్టు ఈ మూవీ పోస్టర్‌ను డిజైన్ చేసారు.  రామ్ చరణ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.


చాలా రోజులుగా చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న ఫస్ట్ లుక్, టైటిల్ బయటకి రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. రీసెంట్‌గా బెల్లంకొండతో చేసిన సినిమాకు ‘జయ జానకి నాయక’ తరహాలో ఈ మూవీకి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పెట్టాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇక  “వినయ విధేయ రామ” పోస్టర్ చరణ్ అభిమానులు ట్విట్టర్ లో ప్రపంచ స్థాయిలో ట్రెండ్ సెట్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు. 


తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.  రాంచరణ్ డైలాగ్ తో ‘అన్నా వీళ్లని చంపాలా బయపెట్టలా..భయపెట్టాలంటే పది నిమిషాలు..చంపాలంటే పదిహేను నిమిషాలు..ఏదైనా ఓకే అంటూ మొదలైయింది. ఇక  టీజర్ కి కూడా కొత్త లెక్కలు పరిచయం చెయ్యడానికి అభిమానులు అందరు సిద్ధం కావాలి అని సోషల్ మీడియాలో అప్రమత్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను మించి పోయేలా మాస్, యాక్షన్ చిత్రంగా బయపాటి తెరకెక్కిస్తున్నారు.


ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తుండగా.... తమిళ నటుడు ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: