తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యువ దర్శకుల జోరు బాగా పెరిగిపోతుంది.  ఇప్పటికే తరుణ్ భాస్కర్, సందీప్ వంగ, అజయ్ భూపతి లాంటి యువ దర్శకులు సూపర్ హిట్ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు.  ఇక రానా హీరోగా ఆ మద్య  'ఘాజీ' చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ప్రేక్షకులచే షెహభాష్ అనిపించుకున్నాడు.  సముద్రంలో.. 'జలాంతర్గామి' నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం యావత్ భారత దేశంలో ఒక్క ఊపు ఊపింది.   తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ తో  'అంతరిక్షం' చేస్తున్నాడు.
Image result for rana ghazi telugu
ఇప్పటికే షూటింగు పూర్తిచేసుకున్న ఈ చిత్రం, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.  ఇప్పటి వరకు భారతీయ చలన చిత్రంలో అంతరిక్షానికి సంబంధించి చాలా తక్కవ చిత్రాలే వచ్చాయి.  తాజాగా తెరకెక్కిస్తున్న ‘అంతరిక్షం’చిత్రం చూస్తున్నంత సేపు థియేటర్లో ప్రేక్షకులు తాము స్పెస్ లో ఉన్నామా అన్నంత అనుభూతి కలుగుతుందని అన్నారు.
Image result for antariksham movie
హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఉత్కంఠను రేకెత్తించేవిగా ఉంటాయి. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని తెలిపాడు సంకల్ప్ రెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: