ఇలయ దళపతి విజయ్, కీర్తి సురేశ్ జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా రాజకీయ దుమారం లేపుతోంది. త‌మిళ‌నాడులో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయో ఎవ‌రూ చెప్ప‌డం అంత ఈజీ కాదు.  "స‌ర్కార్" సినిమాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సీన్స్ ఉన్నాయంటూ.. అలాగే జ‌య‌ల‌లిత‌తో పాటు క‌రుణానిధికి సంబంధించిన వివాదాస్ప‌ద డైలాగులు కూడా ఉన్నాయంటూ ఇప్పుడు ర‌చ్చ జ‌రుగుతుంది.  చెన్నై పోలీస్ లు ..దర్శకుడు ఎఆర్ మురగదాస్ ని అరెస్ట్ చేయటానికి ఇంటికి  రాత్రి వచ్చారనే వార్త తమిళ సినీ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పు మంది. అందులో నిజం ఉందా... అంటే అవుననే సమాధానమిస్తున్నారు మురగదాస్. 

Image result for sarkar movie controversy

ఇంటికి పోలీస్ లు వచ్చి చాలా సార్లు తలుపుపై కొట్టారని...అయితే తాను ఆ సమయంలో బయట ఉండటంతో అరెస్ట్ చేయలేదని తెలిపారు.  కాగా, ఈ సినిమాలో తమిళనాడు దివంగత సీఎం జయలలితతో పాటు ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న సీన్లను తీసేయాలని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు.  సర్కార్ ఆడుతున్న థియేటర్ల దగ్గర అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా తన అరెస్ట్ విషయం పై ‘సర్కార్’ దర్శకులు మురుగదాస్ స్పందించారు. 

Image result for sarkar movie controversy

‘పోలీసులు నా ఇంటికి రాత్రిపూట వచ్చి తలుపులు చాలాసార్లు కొట్టారు. కానీ నేను ఇంటిలో లేకపోవడంతో వెళ్లిపోయారు. ఇప్పుడు నా ఇంటి ముందు పోలీస్ అధికారులెవరూ లేరు’ అని మురుగదాస్ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం మురుగదాస్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, కోలీవుడ్ ఇండస్ట్రీ సైతం మురుగదాస్ కి సంఘీభావం పలుకుతున్నట్లు సమామారం. తమిళ స్టార్ హీరో విజయ్‌ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజీతో వెళ్తుండగా.. ఆయన సినిమాలకు కొన్ని సమస్యలు కూడా ఎప్పటికప్పుడు వెంటాడుతున్నాయి. 

Image result for sarkar movie controversy

 ఆ మద్య రిలీజ్ అయిన ‘మెర్సల్’ తెలుగు లో అదిరింది సినిమా పై కూడా ఎన్నో వివాదాలు నడిచాయి.  తాజాగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్‌’లోని కొన్ని సీన్స్  కూడా చర్చనీయాంశాలుగా మారాయి. ప్రభుత్వపరంగా, పార్టీల పరంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 6న విడుదల అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: