తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఈ మద్య దర్శక, నిర్మాతలు ఇతర టెక్నీషియన్స్ వారసులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి చిత్రంతోనే మాస్ ఇమేజ్ సంపాదించిన బెల్లంకొండ తనయుడు తర్వాత వచ్చిన చిత్రంతో దెబ్బతిన్నా..బోయపాటి దర్శకత్వంలో వచ్చిన  'జయ జానకి నాయక' యావరేజ్ టాక్ తెచ్చుకున్నా హీరోగా మనోడు మంచి మార్కులే కొట్టేశాడు. 
Image result for bellamkonda srinivas
యాక్షన్ తరహా చిత్రాల్లో నటించడానికి ఇష్టపడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరో యాక్షన్ మూవికి సిద్దమైనట్లు సమాచారం.  తాజాగా  శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.   ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. దీనికి 'కవచం' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. పోస్టర్ లో క్రియేటివిటీ పెద్దగా లేకపోయినా.. టైటిల్ మాత్రం క్యాచీగా ఉంది.
Image result for బెల్లం కొండ శ్రీనివాస్ కాజల్
పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ , మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: