టాప్ హీరోయిన్ సమంత ఒక సినిమా షూటింగ్ లో వ్యహరిస్తున్న తీరును పట్టించుకోకుండా నాగచైతన్య మౌనంగా ఉంటూ ఉండటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య సమంతలు కలిసి నటిస్తున్న మూవీ షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది అంటూ గాసిప్పులు వస్తున్నాయి. 
samantha
తెలుస్తున్న సమాచారం మేరకు సమంత ప్రస్తుతం చైతన్య కెరియర్ విషయంలో చాల టెన్షన్ పడుతున్నట్లు టాక్. అతి తక్కువ గ్యాప్ లో ఈఏడాది విడుదలైన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ ఇలా రెండు సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారడం సమంతను తీవ్ర కలవర పాటుకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
samantha wedding reception, naga chaitanya wedding reception, samantha reception, naga chaitanya reception
వాస్తవానికి నాగచైతన్యకు వరస ఫ్లాప్ లు వస్తున్నా సినిమాలు వస్తున్నాయి అంటే అది కేవలం అక్కినేని కుటుంబ నేపధ్యం వలెనే అని అంటారు. అయితే ఇలాగే ఫ్లాప్ లు కొనసాగితే చైతన్య సినిమాలను కొనే బయ్యర్లు కరువవుతారు కాబట్టి చైతన్యతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎవ్వరు ముందుకు రారు. ఇలాంటి పరిస్థుతులలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతా చైతన్యలు కలిసి నటిస్తున్న సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరాలి. 
Samantha Ruth Prabhu and Naga Chaitanya's pre-wedding photoshoot
అందువల్లనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ సెట్ లో షూట్ చేయబడిన సీన్ ను సమంత ఒకటికి రెండుసార్లు షూటింగ్ స్పాట్ లో మొనేటర్ లో చూస్తూ శివ నిర్వాణతో ఆసీన్ ను గురించి చర్చలు చేస్తూ తెగ టెన్షన్ పడిపోతున్నట్లు సమాచారం. అయితే ఈమూవీ షూటింగ్ లో సమంత ఇంత టెన్షన్ పడిపోతున్నా చైతన్య మాత్రం తను నటించిన సీన్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే కూల్ గా తన చేతిలోని సెల్ లో ఏవో మెసేజ్ లు చూస్తూ సమంత టెన్షన్ ను పట్టించుకోకుండా ఉంటున్నాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు గాసిప్పులు ప్రచారం చేస్తున్నారు..     


మరింత సమాచారం తెలుసుకోండి: