నయనతార. అందాల అద్భుతం. దాదాపు పదమూడేళ్ళుగా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి ఓ రేంజిలో సత్తా చూపిన నటి. రజనీకాంత్ నుంచి మొదలుపెడితే టాప్ స్టార్స్ అందరితోనూ జోడీ కట్టి శభాష్ అనిపించుకుంది. తెలుగులో ఈ ఏడాది బాలయ్య జై సిమ్హా మూవీలో జత కట్టిన ఈ ముద్దు గుమ్మ మెగాస్టార్ ప్రతిస్టాత్మక చిత్రం సైరాలో కూడా మెరవనుంది. నయన్ కోలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లో ఇపుడు హాట్ ఫావరేట్ హేరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకుంటోంది కూడా.


అటువంటి క్రేజీ బ్యూటీ ఈ దీపావ‌ళికి ఓ సర్ప్రైజ్ ఇస్తూ ఏకంగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. దీపావళిని ఆమె తన ప్రియుడు దర్శకుడు అయిన విఘ్నేష్ తో జరుపుకుంటున్న స్టిల్ తో గట్టిగా హగ్ చేసుకుటూ దిగిన ఫోటోను సోషల్ మీడియాకు పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫోటోపై పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చి పడుతున్నాయట. నయన్ ప్రేమాయణం ఇలా బయట పడడం, నయన్ తానే స్వయంగా పోస్ట్ చేయడం పట్ల రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.


నయన్ పెళ్ళి కాకుండానే కాపురం పెట్టేసిందా అంటూ సెటైర్లు పడుతున్నాయి. నయన్ విఘ్నేష్ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసినా ఇలా పబ్లిక్ గా నయన్ ఫోటో పోస్ట్ చేయడం వెనక సంగతేంటని కూడా ఆరా తీస్తున్నారు. ఇక నయన్ విషయానికి వస్తే ఇంతకు ముందు నటుడు శింబుతో ఘాటు లవ్ ట్రాక్ నడిపింది. అలాగే ప్రభుదేవతో కూడా ఆమె లోతైన ప్రేమలో మునిగిపోయి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇపుడు విఘ్నేష్ తో పెళ్ళి కాకుండానే ఇలా ఫొటోలకు పోజులిచ్చి మళ్ళీ హాట్ న్యూస్ గా నిలిచింది. మొత్తానికి అమ్మో నయన్ అంటున్నారంతా.



మరింత సమాచారం తెలుసుకోండి: