‘గీత గోవిందం’ కన్నా ముందుగా రావలసిన  ‘ట్యాక్సీవాలా’ రకరకాల కారణాల వల్ల వాయిదా పడి వచ్చే శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  వాస్తవానికి ఈసినిమాను మేలో సమ్మర్ రేస్ లో ని బెట్టాలి అన్న ఉద్దేశంతో విజయ్ దేవరకొండ ఒక చిన్నపిల్లల గ్యాంగ్‌ ను పెట్టుకుని అప్పట్లో వెరైటీగా ప్రమోషనల్ వీడియోలు తయారుచేయించి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆపిల్ల గ్యాంగ్‌ విజయ్ దేవరకొండతో ఒక వెరైటీ  వీడియోను తయారుచేసి ఈసినిమాను మరోసారి వెరైటీగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

‘ట్యాక్సీవాలా’ సినిమా ఇంకా ఎడిటింగ్ పూర్తి కాకముందే పైరసీ   కాబడి ఆన్ లైన్లో లీక్ అయిన నేపధ్యంలో ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఒక వెరైటీ ప్రమోషన్ చేస్తున్నారు. ఆ పిల్లల గ్యాంగ్ విజయ్ ఇంట్లోకి వచ్చి ‘ట్యాక్సీవాలా’ యావరేజ్ మూవీ అంటున్నారు కదా అంటూ ప్రశ్నిస్తారు. దానికి విజయ్ ఇంకా రిలీజ్ కాని ఆసినిమాకు టాక్ ఎలా వచ్చింది అని ఆ పిల్లలను ప్రశ్నలు వేస్తాడు.  

దానికి ఆపిల్లలు తాము లీక్ అయిన సినిమాను చూసాము అంటూ సమాధానం ఇస్తారు. దీనితో విజయ్ ఆశ్చర్యపోతు పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా ఆసినిమా చూసి కామెంట్ చేయడమేమిటి అంటూ ఒక సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ ఎంత అవసరమో ప్రాక్టికల్‌ గా వివస్తాడు. ముందుగా ఉడికించని పాస్తాను టేస్ట్ చూపించి ఆ తర్వాత దానికి అవసరమైన దినుసులు మసాలాలు అద్ది ఉడికించి ఆతర్వాత దానిని పిల్లలకు రుచి చూపిస్తాడు. పోస్ట్ ప్రొడక్షన్ కాని సినిమా వండని తిను బండారం లాంటిదని అంటూ  వంట వండాక దాని రుచి ఎలా వేరుగా ఉంటుందో ఎడిటింగ్ మిక్సింగ్ అన్నీ అయ్యాక సినిమా ఫీల్ కూడా వేరుగా ఉంటుంది అంటూ విజయ్ పిల్లలకు క్లాసు పీకుతాడు. 

దీనితో ఈవీడియోను చూసినవారు విజయ్ అండ్ టీమ్ ఈ ప్రమోషన్లతో తమ క్రియేటివిటీ చూపించి జనాల దృష్టిని ఆకర్షించడానికి చాలా తెలివిగా ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండను హీట్ చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో విజయ్ అనుసరిస్తున్న ఈవ్యూహం ఎంతవరకు ‘టాక్సీవాలా’ కలిసి వస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: