ఈ ముదురు భామ సినిమా రంగంలోకి అడుగుపెట్టడమే పాతికేళ్ళు పై దాటి అయితే ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా టాప్ గ్రేడ్ స్టార్స్ తో జోడీ కట్టి తన సతా  చూపిస్తున్న ఈ హీరోయిన్ పేరు హ్యూమా ఖురేషీ. ముప్పయి  వయసు దాటిన ఈ బ్యూటీ తనలోని అందాన్ని మాత్రం  అలాగే పదిలం చేసుకుంది. గ్లామర్ కు కొత్త భాష్యం చెబుతూ ఎవరితోనైనా రెడీ అంటోంది.


కాలా మూవీలో సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన జత కట్టిన హ్యూమా ఖురేషీ బాగానే పేరు సంపాధించుకుంది. 2012 లో సినిమా తెరపైన కనిపించిన ఈ బొద్దు గుమ్మ బహు భాషా చిత్ర నటిగా ఇప్పటికే  పేరు తెచ్చుకుంది. లేటెస్ట్ టాక్ ఏంటంటే ఈ అమ్మడు తెలుగులో కూడా ఓ భారీ మూవీలో నటిస్తోందట. ఎవరి పక్కనో కాదు,  మన మెగా స్టార్ చిరంజీవి తోనే ఆడి పాడనుందట. కొరటాల, మెగాస్టార్ కాంబోలో వచ్చే కొత్త చిత్రంలో హ్యూమా ఖురేషీ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని భోగట్టా.


అంతే కాదు, మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పక్కన వెంకీ మామ మూవీలోనూ హ్యూమా ఖురేషీ నటిస్తోంది. ఈ చిత్రంలో వెంకీ తన సొంత మేనల్లుడు నాగ చైతన్యతో కలసి నటిస్తున్నాడు. ఇలా హ్యూమా టాప్ స్టార్ సీనియర్లకు జోడీగా భలే కుదిరిపోయిందని అంటున్నారు. తెలుగులో సీనియర్లకు హీరోయిన్ ప్రోబ్లం ఓ లెక్కలో ఉంది. హ్యూమా ఎటువంటి భేషజాలకు పోకుండా సీనియర్లకే ఓటు వేయడం ద్వారా తన హవాను చాటుకుంటూనే ఓ వెలుగు వెలుగుతోందంటున్నారు. ఎంతైనా ఈ భామ తెలివే తెలివి అని సాటి సీనియర్ నటీమణులు అసూయ పడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: