స్టార్ హీరో విజయ్, క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘సర్కార్’ సినిమాపై గత రెండు రోజుల నుంచి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలోలో జయలలితను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇందులోని సీన్లు వెంటనే తొలగించాలని..లేదంటే వివాదం మరింతగా ముదిరిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు కొన్ని థీయేటర్లు ధ్వంసం చేయడంతో ‘సర్కార్’ సినిమాను పలు చోట్ల నిలిపివేశారు. అయితే నిన్న రాత్రి దర్శకులు మురుగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు ఆ సమయంలో తాను లేనట్లు లేదంటే అరెస్ట్ చేసి ఉండే వారని దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

Image result for sarkar movies

ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వార్తలు వస్తున్నాయి.  తాజాగా ‘సర్కార్’ సినిమాకు  కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సర్కార్‌కు తమ మద్దతును ప్రకటించారు.  ‘సెన్సార్ బోర్డు సినిమా ప్రదర్శనకు అనుమతిచ్చాక పలు సినిమాలను తొలగించాలని డిమాండ్ చేయడం, పోస్టర్లను చించుతూ ఆందోళన చేయడం సబబు కాదు. ఇవన్నీ అననైతిక చర్యలు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా’ అని రజనీ ట్వీట్ చేశారు.  మరోవైపు కమలహాసన్ స్పందిస్తూ..‘సర్కార్ లాంటి సినిమాల్లో మార్పులు చేయాలని వేధించడం ఈ ప్రభుత్వానికి కొత్తేం కాదు. సర్కార్ సినిమా సెన్సార్ ను ఎప్పుడో పూర్తిచేసుకుంది.

Image result for sarkar movies

ప్రజా విమర్శలను తట్టుకోలేని ప్రభుత్వం ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది’ అంటూ విమర్శించారు. ఇక మురుగదాస్ ఇంట్లోకి పోలీసులు ఎందుకు వెళ్లారని నడిగర్ సంఘం అధ్యక్షుడు, హీరో విశాల్ ప్రశ్నించాడు. సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపాక, ప్రజలు సినిమాను ఆస్వాదిస్తున్నప్పుడు ఈ అనవసర గొడవ ఏందుకు అంటూ ప్రశ్నించాడు. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించగా, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా నెగిటీవ్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: