బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కలిసి నటించిన హిందీ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ అన్ని రికార్డులను తిరగరాసింది. మిస్టర్ ఫర్ఫెషనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన సినిమాలకు దేశమంతా క్రేజ్ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక వైవిధ్యం కోసం ఆరాటపడే అమీర్... ప్రతీ సినిమాకీ చాలా గ్యాప్ తీసుకుంటాడు. 

 విడుదలైన మొదటి రోజు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి....

తాజాగా అమీర్ ఖాన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఫనా ఖాన్, కత్రీనా కైఫ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుంచి బీభత్సమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్ల పై ప్రబావం పడిపోతుందని భావించారు.  కానీ అందరి అంచనాలు తారు మారు చేస్తూ..మొదటి రోజు 52 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టిందీ చిత్రం.

 భారీ తారాగణంతో ప్రతీ ఫ్రేమ్‌ రిచ్‌గా నిర్మించినా కథా, కథనం సరిగా లేవని ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’కు విమర్శల వెల్లువ...

దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ రూ. 50.75 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్...తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి కోటిన్నర రూపాయల వసూళ్లు కొల్లగొంట్టింది.  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ 2018లో విడుదలైన సినిమాల్లో తొలి రోజు కలెక్షన్స్ పరంగా  టాప్ ప్లేస్‌లో నిలిచిందన  ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్ల‌డించాడు. బాలీవుడ్ చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

 ‘దూమ్ 3’ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’

 ‘యష్ రాజ్ ఫిల్మ్’ సంస్థ నిర్మించిన చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ తెచ్చిన సినిమా  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’  నిలిచింది. కాగా ఈ మూవీ యావ‌రేజ్ టాక్ తెచ్చుకోవ‌డంతో వీకెండ్ కలెక్షన్లు ఇవే స్థాయిలో ఉంటాయా లేదా అనేది అనుమానమే నంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: