ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు రెండు పాటలు, నాలుగు డైలాగులతోనే సరిపోతుంది.  ఎంత గ్లామర్ వలకబోస్తే..అంత క్రేజ్ ఉంటుంది. పాత తరం నటీమణులకు నటనకు మాత్రమే ప్రాధాన్య ఇస్తూ..వారిలో గొప్ప నటులను ప్రేక్షకులకు చూపించే వారు.  కానీ నేటి తరం హీరోయిన్లు గ్లామర్ తోనే కుర్రాకారుకి మత్తెక్కిస్తూ పబ్బం గడుపుతున్నారు.  అయితే కొంత మంది హీరోయిన్స్ ఈ  కేటగిరిలోకి రారు. అలాంటి వారిలో అందాల బొమ్మళి అనుష్క.   సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క కొత్తలో గ్లామర్ తరహా పాత్రల్లో నటించింది. 
Image result for ANUSHKA
‘అరుంధతి’సినిమా తర్వాత ఎక్కువ శాతం నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.  ఈ నేపథ్యంలో రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పంచింది.  భాగమతి తర్వాత అనుష్క ఏ సినిమాల్లో కనిపించలేదు.  ఆమె బరువు పెరిగిన కారణంగా అవకాశాలు తగ్గిపోయాయనేది టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. చాలా కాలం తర్వాత అనుష్క ఓ సినిమాకు కమిట్ అయిందట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
Related image
కోన వెంకట్, గోపీ మోహన్ ఈ చిత్రానికి రచయితలుగా పనిచేయనున్నారు. ఈ చిత్రంలో అనుష్కకు జోడీగా మాధవన్ నటించనున్నారు. నటుడు సుబ్బరాజు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కథ ప్రకారం ఎక్కువభాగం చిత్రీకరణ యూఎస్ లో జరగనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అక్కడ షూటింగు మొదలవుతుందని కోన వెంకట్ చెప్పారు.  చాలా కాలాం తర్వాత అనుష్క .. మాధవన్ లు కలిసి నటిస్తుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: