రాధిక ఆప్టే ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెబుతుంది. దక్షిణాదిలో ఎదురైన వేధింపుల గురించి ఇటీవల నేహా దూపియా టాక్ షోలో మాట్లాడారు. అలాగే గతంలో లీకైన తన నగ్న వీడియో గురించి స్పందించారు. లీకైన వీడియో ఉదంతంపై మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు. ఇంకా ఏమన్నారంటే.. దర్శకుడు అనురాగ్ బసు తీసిన మ్యాడ్‌లీ అనే షార్ట్ ఫిలింకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో లీక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

నేను పెద్దగా పట్టించుకోను

ఆ తర్వాత వాట్సప్ గ్రూప్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మొదట నా డ్రైవర్ ఆ విషయాన్ని నా దృష్టికి తెచ్చాడు. ఈ వీడియోను స్వయంగా తన తల్లి తనకు పంపారని చెప్పారు. వీడియో లీక్ వ్యవహారాన్ని నేహా దూపియ ప్రశ్నించగా.. ఓ నవ్వు నవ్విన రాధిక ఆప్టే.. ఇలాంటి విషయాలను నేను గానీ, నా కుటుంబం గానీ పెద్దగా పట్టించుకోలేదు. క్లిప్పును చూసి నా తల్లి చాలా తేలికగా తీసుకొన్నది. అలాంటి విషయాలు నాపై పెద్దగా ప్రభావం చూపవు అని రాధిక ఆప్టే పేర్కొన్నది. 

షార్ట్ ఫిలిం వీడియో లీక్

వీడియో లీక్‌ను మీడియాలో పెద్దగా చూపాలని ప్రయత్నించారు. కానీ ఏమైంది. రెండు రోజుల తర్వాత అందరూ మరచిపోయారు. ఇప్పుడు కూడా ఏమైనా జరిగితే దానికంటే ఎక్కువగా చేయలేరు. అందుకే నాలో ధైర్యం పెరిగింది. అలాంటి ఘటన తర్వాత ఏం జరిగిన నాకు తేలికగా తీసుకోవడం అలవాటైపోయింది అని రాధిక ఆప్టే అన్నారు. రాధిక ఆప్టే నటించిన వీడియోలు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2015లో పార్చడ్‌ చిత్రంలో ఆదిల్ హుస్సేన్‌తో నటించిన శృంగార సన్నివేశం కూడా లీక్ కావడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. లీక్ ఘటన రాధిక ఆప్టే పెద్దగా స్పందించలేదు. పట్టించుకోకపోవడంతో ఆ వివాదం అప్పుడే సమసిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: