మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతతో ఎదురు చూసిన ‘వినయ విధేయ రామ’ టీజర్ కు విపరీతమైనస్పందన వస్తోంది. నిన్న ఉదయం విడుదలైన ఈటీజర్ కు విడుదల అయిన అర గంటలోనే ఒక మిలియన్ హిట్స్ వచ్చాయి అంటే ఈమూవీ పై చరణ్ అభిమానులకు ఉన్న అంచనాలు అర్ధం అవుతున్నాయి. 
 దేవిశ్రీ మ్యాజిక్
టీజర్ చివరలో చరణ్ పేల్చిన పంచ్ విపరీతంగా మెగా అభిమానులకు కనెక్ట్ అవుతోంది. ‘నువ్వు పందెం పరమేశ్ అయితే ఏంట్రా ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ లో ‘కొ..ణి..దె..ల’ అని డైలాగ్ లోని చివరి అక్షారాలు పలికే విధానం బాడీ లాంగ్వేజ్ ఆ చేతుల్ని ఊపుతూ బల్లమీద కొట్టడం చూసిన వారికి పవన్ కళ్యాణ్ ‘బద్రి' సినిమాలోని ఆల్ టైం క్లాసిక్ డైలాగ్ ‘నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్’ అనే డైలాగ్ గుర్తుకు వస్తోంది అంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 
స్టైలిష్‌గా
చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి చాల సంవత్సరాలు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ని మెగా అభిమానులకు తెలిసే విధంగా ఎప్పుడు చరణ్ ఇమిటేట్ చేయలేదు. పవన్ రాజకీయాల బాట పట్టి సినిమాలకు దూరం అయిన నేపధ్యంలో చరణ్ తాను చిరంజీవికి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కు కూడ వారసుడుని అని సంకేతాలు ఇవ్వడానికి ఇలాంటి ప్రయోగం చరణ్ ‘వినయ విధేయ రామ’ లో చేసి ఉంటాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
 భయపెట్టాలంటే 10 నిమిషాలు
ఈ ట్రైలర్ కు స్పందన బాగానే వస్తున్నప్పటికీ ఈమూవీ బోయపాటి మార్క్ లో ఉండే ఊర మాస్ సినిమా అన్న సంకేతాలు వస్తున్నాయి. మూవీ టైటిల్ చాల క్లాసిక్ గా పెట్టి సినిమాలోని సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసే పద్ధతిని ప్రస్తుతం బోయపాటి అను సరిస్తున్నాడు.  అయితే ఈమధ్య కాలంలో ఓవర్సీస్ ప్రేక్షకులు ఊర మాస్ సినిమాల పట్ల ఏమాత్రం ఆసక్తి కనపరచని పరిస్థుతులలో చరణ్ బోయపాటిల లేటెస్ట్ ప్రయత్నానికి ఎంత వరకు కనెక్ట్ అవుతారు అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: