ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌ లకు స్టార్ ఇమేజ్ ఉన్నా ఆ స్టార్ ఇమేజ్ రాజమౌళి ముందు పనికిరాదు. అందువల్లనే ఎటువంటి టాప్ హీరో అయినా రాజమౌళి దర్శకత్వంలో నటించేడప్పుడు అతడు చెప్పిన కండిషన్స్ తూచా తప్పకుండా పాటించ వలసిన పరిస్థితి. 

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ అదే జరుగుతోంది అని సమాచారం.  చరణ్ జూనియర్ లు ఇద్దరికీ ఈసినిమాలో పారితోషికం లేదు. కేవలం లాభాలలో వాటా  మాత్రమే. ఈ చిత్ర నిర్మాత దానయ్య కూడా పేరుకి మాత్రమే నిర్మాత అని అంటున్నారు. అన్ని వ్యవహారాలు రాజమౌళి చక్కపెట్టిన తరువాత మాత్రమే ఆ నిర్ణయాలు దానయ్యకు తెలుస్తున్నట్లు టాక్. 
SS Rajamouli,RRR,Ram Charan
ఇలాంటి పరిస్థుతులలో వచ్చే వారం నవంబర్ 11న లాంఛనంగా ప్రారంభం కాబోతున్న ఈమూవీలో నటిస్తున్న జూనియర్ ను గుర్తు పట్టలేనంత విధంగా గడ్డం పెంచుకోమనీ రాజమౌళి ఇప్పటికే తారక్ కు సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం జూనియర్ ఫిజిక్ గురించి మాత్రమే కాకుండా జూనియర్ గుబురు గడ్డం గురించి కూడ రాజమౌళి శ్రద్ద తీసుకుంటున్న నేపధ్యంలో ఈ గడ్డం కు ‘ఆర్ ఆర్ ఆర్’ లోని జూనియర్ పాత్రకు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Jr NTR to start Rajamouli RRR
ఇది ఇలా ఉంటే ఈమూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్న నేపధ్యంలో బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తో ఇప్పటికే రాజమౌళి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈమధ్య కాలంలో కీర్తి సురేశ్ ఫిజిక్ లో మార్పు వచ్చిన నేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ఆమెను ఎంపిక చేసే విషయంలో రాజమౌళి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు టాక్. ఇలా అన్ని తానై తీసుకుంటున్న రాజమౌళి నిర్ణయాల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాల వేగంగా జరుగుతూ ఉండటమే కాకుండా కీరవాణి ఈసినిమా కోసం స్వర పరిచిన కొన్ని ట్యూన్స్ ను కూడ వింటున్నట్లు సమాచారం..    



మరింత సమాచారం తెలుసుకోండి: